సందీప్‌కు భారీ ఆఫర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకుడు సందీప్ వంగా బాలీవుడ్‌లో మరో సునామీ సృష్టించడానికి సిద్ధమవుతున్నాడట. ఈసారి దర్శకుడిగానే కాదు, నిర్మాతగా కూడా. అర్జున్‌రెడ్డితో టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్ చేసిన టైంలో -తెలుగు స్టార్ హీరోలు చాన్సిస్తామంటూ సందీప్‌కు సంకేతాలు పంపినా, -టైం కలిసొచ్చో, ప్రాజెక్టు సెట్‌కాకో -సందీప్ టెమ్టవ్వలేదు. రొటీన్ ప్రాజెక్టులకు దూరంగానే ఉండిపోయాడు. అర్జున్‌రెడ్డిని నేషనల్ స్క్రీన్‌పై మరింత హైలో చూపించాలన్న ఉద్దేశాన్ని కంటిన్యూ చేశాడు. అనుకున్నట్టే -అర్జున్‌రెడ్డి క్యారెక్టర్‌కు మరింత మసాలా దట్టించి కబీర్‌సింగ్‌గా హై రేంజ్‌కు తీసుకెళ్లాడు. సినిమాగానూ, పాత్రపట్లా వచ్చిన విమర్శలన్నీ -సందీప్ స్టామినాముందు నిలబడలేదు. బాక్సాఫీస్ వద్ద ప్రాజెక్టుపై కోట్లు కురిశాయి. ఊహించని విజయంతో రేంజ్‌వున్న దర్శకుడిగా బాలీవుడ్‌లో సందీప్ పేరు మార్మోగింది. దీంతో -తెలుగు సినిమా ఆలోచనల్ని పూర్తిగా పక్కన పెట్టేశాడు సందీప్. తన ఊహల్లోని లార్జ్ స్కేల్ స్టోరీ ఎక్కువ మంది ఆడియన్స్‌కి రీచవ్వాలంటే -బాలీవుడ్ స్క్రీన్‌తోనే సాధ్యమని సందీప్ చాలాసార్లు చెప్పిందే. ఇప్పుడు బాలీవుడ్ నుంచి సందీప్‌కు భరోసా దక్కడంతో -నిర్మాతగానూ పెద్ద సినిమాకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాడట. కబీర్‌సింగ్‌తో కోట్ల లాభాలు ఆర్జించిన నిర్మాతలత్రయం -అశ్విన్ వార్దే, మురాద్ ఖేతని, భూషణ్‌కుమార్‌లు సందీప్ ముందుకు సరికొత్త ప్రతిపాదన తేవడమే ఇందుక్కారణం. ‘లాభాల్లో 50 శాతం వాటా’ను ప్రతిపాదించటంతో -సొంత బ్యానర్ భద్రకాళి ప్రొడక్షన్స్ భాగస్వామిగా కొత్త ప్రాజెక్టుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. హిందీలోని మాస్టర్ పీస్ హీరోలతో సందీప్ వంగా బాలీవుడ్‌లో సృష్టించనున్న సునామీ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి అప్పుడే మొదలైంది.