హిట్టుకోసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుస ఫ్లాపులతో విసిగిన సాయిధరమ్ ఫేట్‌ని నమ్ముకుని పేరు మార్చుకుని -చిత్రలహరి సినిమా చేసినా సంతృప్తినివ్వలేదు. రేసులో తోటి హీరోలతో పరిగెత్తాలంటే అర్జెంట్‌గా అతనికో హిట్టుపడాలి. సో, హిట్టుకోసం తహతహలాడుతున్నాడు. దర్శకుడు దేవ కట్టా పరిస్థితీ భిన్నం కాదు. అతని దర్శకత్వ చరిత్రలో -ప్రస్థానాన్ని పదే పదే చెప్పుకోవడం తప్ప, కెరీర్‌ను మలుపుతిప్పే హిట్టయితే మళ్లీ పడలేదు. అందుకే -కెరీర్ బ్రేక్ కోసం కంటెంట్ బేస్డ్ సినిమాకు ఇద్దరూ సిద్ధమైనట్టు సమాచారం. జనం ఏయే సమస్యలతో సతమతమవుతున్నారో -వాటినే వెపన్స్‌గా వాడి సాయితేజ్ కోసం దేవకట్టా ఓ ‘నిజాయితీ’ కథను సిద్ధం చేశాడట. జన జాగృతినే కమర్షియల్ ఎలిమెంట్స్‌గా మలచుకుని దేవకట్టా సిద్ధం చేసిన స్క్రిప్ట్ -ఇద్దరి కెరీర్‌కు కొత్త ఉత్సాహాన్ని ఇవ్వగలదన్న నమ్మకంతో ఉన్నారట. సో, వచ్చే డిసెంబర్ నుంచి సెట్స్‌పైకి వెళ్లేందుకు ఇద్దరూ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ప్రీ ప్రొడక్షన్స్ దశలోవున్న ప్రాజెక్టుకు సంబంధించి ఇంతవరకూ తారాగణాన్ని ఫిక్స్ చేయలేదట. అయితే, -పేరున్న ఆర్టిస్టులనే ప్రాజెక్టులోకి తీసకోవచ్చనీ వినిపిస్తోంది.