రవితేజతో శృతి జోడీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిస్కోరాజా’ను రిలీజ్ దగ్గరకు తీసుకొచ్చేశాడు రవితేజ. దర్శకుడు విఐ ఆనంద్ తెరకెక్కించిన ఈ చిత్రంలో -రవితేన మునుపటి స్టామినాను చూపించనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. పైగా మాస్ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేసేందుకు హీరోయిన్ల అందాలను ఎరవేస్తున్నారన్న విషయం -పోస్టర్ లుక్స్ చూస్తే అర్థమవుతుంది. రవితేజ సరసన పాయల్ రాజ్‌పుత్, నభానటేష్‌లు ఓ రేంజ్ గ్లామర్ ఒలకబోశారన్న మాట వినిపిస్తోంది. ఈ ప్రాజెక్టు తరువాత గ్యాప్‌లేకుండా కొత్త ప్రాజెక్టును సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు రవితేజ సిద్ధమైపోతున్నాడు. గోపీచంద్ మలినేనితో రవితేజ కొత్త ప్రాజెక్టు చేస్తున్నాడన్న విషయం కొంతకాలంగా వినిపిస్తున్నదే. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతోన్న తరుణంలో -తాజాగా కథానాయికనూ కన్ఫర్మ్ చేసుకున్నారన్న వార్త వినిపిస్తోంది. రవితేజ సరసన శృతిహాసన్‌ను తీసుకునే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్టు వినికిడి. ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు చేస్తున్నారట. ఇటీవలి కాలంలో సినిమాలకు బాగా గ్యాప్ తీసుకుని, మళ్లీ స్క్రీన్‌పైకి వచ్చేందుకు ఫోకస్ చేస్తున్న శృతిహాసన్ -ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పే అవకాశం ఉంటుందని అంటున్నారు. గతంలో రవితేజ-శృతిహాసన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘బలుపు’ మంచి విజయం సాధించిన నేపథ్యంలో -మరోసారి రవితో కెమిస్ట్రీ పండించేందుకు శృతిహాసన్ ఓకే చెప్పొచ్చన్నది ఓ అంచనా.