కార్తికేయ 90ఎంఎల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్‌ఎక్స్ 100 -ఆడియన్స్‌కి మామూలు కిక్కవ్వలేదు. న్యూవేవ్ సినిమాగా భారీ విజయాన్ని అందుకున్న సినిమాను కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ తెరకెక్కించింది. హీరో కార్తికేయకూ ఒక్కసారిగా ఇమేజ్ తెచ్చింది ఆర్‌ఎక్స్ 100. అదే క్రేజీ కాంబినేషన్‌లో మరో సినిమా రూపుదిద్దుకుంటోంది. అదే -90ఎంఎల్. సినిమాలో కార్తికేయతో నేహాసోలంకి జోడీ కట్టింది. దర్శకుడు శేఖర్‌రెడ్డి ఎర్ర తెరకెక్కిస్తోన్న చిత్రాన్ని నిర్మాత అశోక్‌రెడ్డి గుమ్మకొండ నిర్మిస్తున్నారు. సినిమా వివరాలను మీడియాకు వెల్లడిస్తూ -మంచి సినిమాకు వచ్చే గుర్తింపు, గౌరవం, వసూళ్ల సందడి ఎలా ఉంటుందో ఆర్‌ఎక్స్ 100తో రుచి చూశాం. ఇప్పుడు మా కాంబినేషన్‌లో మరో సినిమా వస్తుండటం హ్యాపీగా ఉంది. తాజా చిత్రానికి -90ఎంఎల్ టైటిల్ ఫిక్స్ చేశాం. టైటిల్‌కి తగ్గట్టే సినిమా వైవిధ్యం. 70శాతం చిత్రీకరణ పూర్తిచేశాం. కొత్త దర్శకుడు శేఖర్‌రెడ్డి సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాడు. ఈ బ్యానర్ నుంచి ఆర్‌ఎక్స్ 100ను మించిన సినిమాయే ఉంటుంది అన్నారు. దర్శకుడు శేఖర్‌రెడ్డి ఎర్ర మాట్లాడుతూ -కార్తికేయ చేసిన ఆర్‌ఎక్స్ 100 ఓ రెఫరెన్స్. దాన్ని దృష్టిలో పెట్టుకుని అంతకుమించి ఉండేలా -90ఎంఎల్ కథ రాసుకున్నా. పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్ ఇది. ‘సైరా’లో కీలకపాత్ర చేసిన రవికిషన్ ఈ సినిమాలో మంచి పాత్ర చేశారు. ఈనెల 11నుంచి హైదరాబాద్‌లో క్లైమాక్స్ షూట్ చేస్తాం. మరో షెడ్యూల్‌లో బ్యాలన్స్ టాకీ, 2 పాటలు చిత్రీకరిస్తే షూటింగ్ పూర్తవుతుంది అన్నారు.