ఎదురుచూస్తున్నా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వందో సినిమా మైలురాయి దగ్గరకు ఎప్పుడు చేరుకుంటానా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. ఎందుకంటే -ఆ సినిమాను శతాధిక చిత్ర దర్శకుడు చేస్తానని నాకు మాటిచ్చాడు. ఆ పిలుపు వినిపించే టైంకోసం వేగంగా అడుగులేస్తున్నా అంటున్నారు నిర్మాత తుమ్మలాపల్లి రామసత్యనారాయణ. మంగళవారం బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్న రామసత్యనారాయణ -ఇప్పటి వరకూ సాగిన సినిమా ప్రయాణంలో ఎత్తుపల్లాలు ఆ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. -2004లో ఇండస్ట్రీకి వచ్చాను. ఎదురు దెబ్బలతో డబ్బు పోగొట్టుకున్నా -ఇక్కడే నిలదొక్కుకోవాలన్న కసిని మాత్రం వదల్లేదు. ఇండస్ట్రీలో చిన్న నిర్మాతలకు ఒక్క ఫ్లాప్ పడితే మళ్లీ కనిపించే పరిస్థితి ఉండదు. అందుకే ఫీల్డ్‌లో ఉండాలంటే సేఫ్ ఫ్లాన్స్‌తో ముందుకెళ్లాలన్న ఆలోచనలకు పదును పెట్టుకున్నా. అలా బడ్జెట్ కంట్రోల్ ప్రణాళికలతో 97 సినిమాలు పూర్తి చేశా. శివ 143 టైటిల్‌తో 98వ సినిమా వస్తోంది. చివరి రెండు సినిమాలు నాకు కీలకం. ఎందుకంటే -99వ సినిమా నాకిష్టమైన వివాదాస్పద దర్శకుడితో ప్లాన్ చేస్తున్నా. కథ రెడీ అవుతోంది అన్నారు తుమ్మలాపల్లి. నటుడిగా 75 సినిమాల్లో కనిపించా. శివ 143లోనూ రాష్టప్రతి పాత్ర చేస్తున్నా. నిర్మాతగా, నటుడిగా నా లైఫ్ హ్యాపీగా సాగిపోవడానికి నిర్మాత సి కళ్యాణ్ ఆశీస్సులే కారణం. కోడి రామకృష్ణ, దాసరి నారాయణరావు స్ఫూర్తి, కె రోశయ్య సహకారం ఎప్పటికీ మరువలేను అన్నారు. వివి వినాయక్, రాంగోపాల్‌వర్మ ఇష్టమైన దర్శకులంటూనే, ఇండస్ట్రీలో ఎంతోమంది సహకారంతోనే లైఫ్ హాయిగా సాగుతోందని గుర్తు చేసుకున్నారు.