ఆర్డీఎక్స్‌లాంటి ట్రైలర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేటాడాలనుకున్న మగాడికి ఆడపిల్ల లేడిపిల్లలా కనిపించొచ్చు. అదే వేటాడాలనుకున్న ఆడపిల్లకి మగ సింహం కూడా కుక్కపిల్లలా కనిపిస్తుంది’ అంటూ వార్నింగ్ ఇస్తోంది పాయల్ రాజ్‌పుత్. ఒక ఊరి సమస్యను పరిష్కరించే తెగువ కలిగిన అందమైన ఆడపిల్లగా పాయల్ రాజ్‌పుత్ కనిపించనున్న సినిమా -ఆర్‌డిఎక్స్ లవ్. తెలుగు తెరను అలుముకుంటున్న ప్రేమకథల సమూహంలో ఇదో వైవిధ్యమైన కథగా చిత్రబృందం చెబుతోంది. హుషారు ఫేమ్ తేజూస్ కంచెర్ల, పాయల్‌రాజ్‌పుత్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ నుంచి తాజాగా ట్రైలర్ విడుదలైంది. లవ్, రొమాన్స్, యాక్షన్, ఎమోషన్ సన్నివేశాల సమ్మిళితంగా ట్రైలర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. సీనియర్ నరేశ్ డైలాగ్‌లో ఊరి సమస్యను ప్రస్తావించటం చూస్తే -గ్రామీణ నేపథ్యంగా సినిమా తెరకెక్కినట్టు అర్థమవుతోంది. నాగినీడు, ఆదిత్యమీనన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న చిత్రంలో సీనియర్ హీరోయిన్ ఆమని కీలకమైన పాత్రలో కనిపించనుంది. ఆర్‌డిఎక్స్ లవ్
త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.