లవ్‌స్టోరీతోనే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బన్నీ -త్రివిక్రమ్ ‘కథ’పై కథనాలు చల్లబడటంతో.. తరువాత సుకుమార్‌తో చేయబోయే స్క్రిప్ట్ కూడా ఫైనలైందంటూ కొత్త కథనాలు షికారు చేస్తున్నాయి. అల.. వైకుంఠపురములో కథ చెప్పడానికి బన్నీ -త్రివిక్రమ్ ఓ ప్రాజెక్టు చేస్తున్న విషయం తెలిసిందే. సంక్రాంతికి తెచ్చే ఈ సినిమా లవ్ స్టోరీ అని కొంతసేపు.. మైధాలజీలోని ఓ అంశాన్ని సోషల్ సోరీగా చెప్పబోతున్నారంటూ ఇంకొంతసేపు చర్చ జరగడం తెలిసిందే. రోజుకొకటిగా బన్నీ -త్రివిక్రమ్ ప్రాజెక్టుపై కథనాలు వెలువడుతున్నా -చిత్రబృందం మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా పని చేసుకుపోతోంది. ఇద్దరి కాంబినేషన్‌లో రెండు హిట్లు పడటంతో -హ్యాట్రిక్ సక్సెస్‌కు ఎలాంటి కథను తీసుకున్నారోనన్న ఆసక్తి, అంచనాలు మామూలే. ఇదిలావుంటే -తదుపరి ప్రాజెక్టు బన్నీ -సుకుమార్ కాంబోలో రాబోతున్న విషయం తెలిసిందే. స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో కథను చేసేందుకు ఇద్దరూ ఓ అంగీకారానికి వచ్చినా, తాజాగా స్క్రిప్ట్‌పై మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఆర్య సిరీస్‌ను కొనసాగించే ఉద్దేశంతో -మళ్లీ ప్రేమకథనే చెప్పాలని ఇద్దరూ నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. మరుక్షణం సుకుమార్ చెప్పిన లవ్ లైన్ నచ్చటంతో బన్నీ ఓకే చెప్పేశాడని, చాలా త్వరగానే సుకుమార్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశాడని అంటున్నారు. వచ్చే ‘ఆర్య’ ఎలా ఉంటాడో వేచి చూడాలి.