అక్కడా బిజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు, తమిళంలో బిజీగావున్న రష్మిక -మాతృ భాష కన్నడలోనూ సినిమాకు న్యాయం చేస్తోంది. అర్జున్ మేనల్లుడు ధ్రువకు జోడీగా కన్నడలో ఆమె చేసిన తాజా చిత్రం పొగరు. దర్శకుడు నందకిషోర్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ఇటీవలే హైదరాబాద్‌లో షూటింగ్ పూర్తి చేసుకుంది. సినిమాలో భైరవ గీత ఫేమ్ ధనుంజయ్ విలన్ రోల్ పోషించాడు. పూర్తి యాక్షన్ సినిమాగా రూపుదిద్దుకున్న చిత్రంలో -ధ్రువ్, రష్మిక కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. అంతర్జాతీయ బాడీ బిల్డర్లతో ధ్రువ్ తలపడే క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ అనీ అంటున్నారు. ధ్రువ్‌ను ఇంట్రొడ్యూస్ చేయడంతోపాటు, రష్మికకున్న ఇమేజ్ నేపథ్యంలో తెలుగు, తమిళ భాషల్లోనూ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారట.