ప్రేమతో మీ చిన్నా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎస్‌ఎస్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై బి చండ్రాయుడు నిర్మిస్తోన్న తొలి సినిమా -చిన్నాతో ప్రేమగా. పీవీఆర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో ఎస్‌ఎన్ చిన్నా, హేమంత్, శ్రద్ధ, చైత్ర, నందిని హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. హైదరాబాద్ పరిసరాల్లో తొలి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -మంచి కథతో సినిమా తీస్తున్నాం. సీనియర్ కొరియోగ్రాఫర్ శివశంకర్ ముఖ్య పాత్ర పోషిస్తూ, మూడు పాటలకు కొరియోగ్రఫీ సమకూరుస్తున్నారు. ఈ వారాంతంలో తొలి షెడ్యూల్ పూర్తవుతుంది. మరో మూడు షెడ్యూల్స్‌లో సినిమా పూర్తవుతుంది అన్నారు. దర్శకుడు పీవీఆర్ మాట్లాడుతూ -ఇదొక లవ్ అండ్ సస్పెన్ థ్రిల్లర్. చిట్టిబాబు కామెడీ, ప్రియాంక క్లాసికల్ డాన్స్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ అన్నారు. శివశంకర్ మాస్టర్ మాట్లాడుతూ -ఓ క్యారెక్టర్, కొరియోగ్రఫీ చేస్తున్నా. నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా సినిమా నిర్మిస్తున్నాడు అన్నారు. రెబాల సుధాకర్‌రెడ్డి సినిమాటోగ్రఫీ, రాజ్‌కిరణ్ సంగీతం సమకూరుస్తున్నారు.