ఆవిరి పుట్టించాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రవిబాబు సినిమా అంటేనే ఓ డిఫరెంట్ అంటారు -సినిమా ప్రేమకులు. పోస్టర్ నుంచే పెద్ద తేడా -అంటారు అతని అభిమానులు. సినిమా సినిమాకూ కొత్త నిర్వచనం ఇవ్వడం అతని స్టయిల్ అయితే, -హిట్టు ప్లాప్‌తో సంబంధం లేకుండా ఓసారి చూద్దాం అనుకోవడం ప్రేక్షకుడి స్టయిల్. అందుకే -రవిబాబు సినిమాను జనమే ప్రమోషన్ చేసేస్తుంటారు. అలాంటి దర్శకుడు రవిబాబు నుంచి వస్తోన్న తాజా ప్రాడెక్ట్ -ఆవిరి. ఈ డిఫరెంట్ టైటిల్ సినిమా -నిర్మాత దిల్‌రాజు సమర్పణలో ఎ ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై నిర్మితమైంది. రవిబాబు, నేహాచౌహాన్, శ్రీముక్త, భరణి శంకర్, ముక్తార్‌ఖాన్ ప్రధాన తారాగణం. పోస్ట్ ప్రొడక్షన్స్ జరుపుకుంటున్న చిత్రాన్ని -అక్టోబర్‌లో విడుదల చేయనున్నారు. సినిమా నుంచి సరికొత్త పోస్టర్ వదిలిన సందర్భంలో దిల్‌రాజు మాట్లాడుతూ -కామెడీ, హారర్ థ్రిల్లర్ చిత్రాలను తెరకెక్కించటంలో రవిబాబు స్పెషలిస్ట్. ఈ రెండు జోనర్స్‌లో ఆయన తెరకెక్కించిన సినిమాలు సూపర్ డూపర్ హిట్లే. అలాంటి టాలెంటెడ్ దర్శకుడితో అసోసియేట్ కావడం హ్యాపీగా ఉంది. రవిబాబు దర్శక నిర్మాణంలో రూపొందుతోన్న ‘ఆవిరి’ ప్రేక్షకులను మెప్పించే చిత్రమవుతుంది. అక్టోబర్‌లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం అన్నారు. దర్శక నిర్మాత రవిబాబు మాట్లాడుతూ -దిల్‌రాజుతో కలిసి సినిమా చేయాలని 15ఏళ్లుగా అనుకుంటున్నా. ఇప్పటికి కుదిరింది. ‘ఆవిరి’కి ఆయనతో కలిసి పనిచేసే అవకాశం రావడం హ్యాపీ. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అక్టోబర్‌లో విడుదలకు ప్లాన్ చేస్తున్నాం అన్నారు.