మార్షల్‌కు సక్సెస్ ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జై రాజాసింగ్ దర్శకత్వంలో అభయ్, మేఘాచౌదరి జోడీగా వస్తున్న సినిమా -మార్షల్. శ్రీకాంత్ ముఖ్య పాత్ర పోషించిన చిత్రాన్ని హీరో అభయ్ తన సొంత బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 13న సినిమా విడుదలవుతోన్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రబృందం. హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ -అభయ్ ఇంట్రొడక్షన్ హ్యాపీగా ఉంది. మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటాడన్న నమ్మకముంది. నిర్మాతగానూ తనను తను ప్రూవ్ చేసుకుంటాడని నమ్ముతున్నా. మార్షల్ సినిమా చూసాను. ఇటీవల వస్తోన్న చిత్రాల్లో ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు అన్నారు. హీరో అభయ్ మాట్లాడుతూ -మార్షల్ చిత్రాన్ని ఎన్నో జాగ్రత్తలు తీసుకుని తెరకెక్కించాం. ఎక్కడా రాజీ పడకుండా స్వామి సినిమాను నిర్మించారు. నా పెర్ఫార్మెన్స్‌లో శ్రీకాంత్ సహకారం చాలా ఉంది. ఓ ప్రేక్షకుడు సినిమా నుంచి ఆశించే అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయి. శ్రీకాంత్ కాంబినేషన్‌లో నేను చేసిన సన్నివేశాలు -అవుట్‌పుట్ మీద మాకు నమ్మకం పెంచాయి. మంచి సినిమాను తెలుగు ప్రేక్షకుడు ఎప్పుడూ ఆదరిస్తున్నాడు. డిఫరెంట్ కానె్సప్ట్‌తో వస్తోన్న మార్షల్ మిమ్మల్ని సంతృప్తిపరుస్తుందనే అనుకుంటున్నా అన్నారు. డైరెక్టర్ రాజాసింగ్ మాట్లాడుతూ -కథ వినగానే హీరో, నిర్మాత అభయ్ సినిమా చేయడానికి ఓకే చేప్పేశాడు. నన్ను నమ్మి ప్రాజెక్ట్ చేసిన శ్రీకాంత్‌కి థాంక్స్. కొత్త పాయింట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం. సెప్టెంబర్ 13న వస్తున్న మార్షల్ విజయం సాధిస్తాడన్న నమ్మకంతో ఉన్నా అన్నారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ -అభయ్ ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం కావడం సంతోషంగా ఉంది. భవిష్యత్తులో నటుడిగా మరో మెట్టెక్కాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు. వరికుప్పల యాదగిరి మాట్లాడుతూ -అవకాశమిచ్చిన హీరో అభయ్‌కి కృతజ్ఞతలు. నేను రాసిన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది అన్నారు. సంగీత దర్శకుడు రవి బర్సుర్ మాట్లాడుతూ -కేజీఎఫ్ తరువాత నేను ఒప్పుకున్న సినిమా ఇది. కథ నచ్చి చెయ్యడానికి అంగీకరించా. దర్శకుడు కొత్త కథతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. నిర్మాత, హీరో అభయ్ మార్షల్‌తో సక్సెస్ సాధిస్తాడు అన్నారు. హీరోయిన్ మేఘచౌదరి మాట్లాడుతూ -నా పాత్ర మీకు నచ్చుతుంది. అభయ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం బెస్ట్ మెమరీ. హీరో శ్రీకాంత్ సెట్స్‌పై సపోర్ట్ చేసిన తీరు మర్చిపోలేను అన్నారు.