పాటతో రైట్‌రైట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుమంత్ అశ్విన్ కథానాయకుడుగా శ్రీ సత్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై జె.వంశీకృష్ణ రూపొందిస్తున్న చిత్రం ‘రైట్ రైట్’. మను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇటీవల పూర్తయింది. జె.బి. అందించిన పాటలలో ‘అల్లి బిల్లి చక్కిలి గిలి రెక్కలే విప్పేను లిల్లి’ అనే పాటను హీరో రామ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుమంత్ తొలి సినిమా నుండే నటనలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నాడని, ఈ సినిమా ఆయనకు టర్నింగ్ పాయింట్ అవుతుందని తెలిపారు. తొలిసారిగా తానీచిత్రంకోసం లుంగీ కట్టి నటించానని, అధిక భాగం అరకులో చిత్రీకరించిన ఈ సినిమాలో కెమెరా పనితనం హైలెట్‌గా నిలుస్తుందని కథానాయకుడు సుమంత్ అశ్విన్ తెలిపారు. 5 పాటలు అందరికీ నచ్చుతాయని, ఎస్‌కోట నుండి గవిటికి వెళ్లే ఓ ఆర్టీసీ బస్‌లో కథనం మొత్తం సాగుతుందని, కామెడీ లవ్ మిస్టరీ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మలయాళం నుండి తెలుగుకు కొన్ని మార్పులు చేర్పులు చేసి చిత్రీకరించామని దర్శకుడు మను తెలిపారు. కార్యక్రమంలో బాహుబలి ప్రభాకర్ తదితరులు చిత్ర విశేషాలను తెలిపారు. నాజర్, ధన్‌రాజ్, షకలక శంకర్, తా.రమేష్, జీవా, రాజారవీందర్, వినోద్, పావని, కరుణ, జయవాణి తదితరులు నటించిన ఈ చిత్రానికి పాటలు: శ్రీమణి, సంగీతం: జె.బి, కెమెరా: శేఖర్ వి.జోసఫ్, మాటలు: డార్లింగ్ స్వామి, నిర్మాత: జె.వంశీకృష్ణ, దర్శకత్వం: మను.