2నే.. సై సై సైరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమరయోధుడు వెన్ను చూపడన్న విషయాన్ని సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించి నిరూపించింది -సైరా టీం. కొణిదెల ప్రొడక్షన్స్‌పై సీనియర్ హీరో చిరంజీవి కథానాయకుడిగా ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన సినిమా -సైరా. సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సైరా -అక్టోబర్ 2 గాంధీ జయంతిన విడుదల చేస్తామని చిత్రబృందం చాలాకాలంగా చెబుతోంది. చిరంజీవినుంచి 151వ ప్రాజెక్టుగా వస్తోన్న సైరా -తెలుగుతోపాటు తమిళం, కన్నడ, బాలీవుడ్‌లోనూ విడుదల చేస్తున్నారు. అయితే, బాలీవుడ్‌లో అదే రోజున మరో భారీ బడ్జెట్ చిత్రం ‘వార్’ థియేటర్లకు రానుంది. హృతిక్ రోషన్, టైగర్‌ఫ్రాఫ్‌ల నుంచి మల్టీస్టారర్‌గా వస్తోన్న చిత్రంపైనా భారీ అంచనాలే ఉన్నాయి. పైగా సినిమాను సౌత్ లాంగ్వేజెస్‌లోనూ విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకున్నారు. రెండు పెద్ద చిత్రాలు ఒకేరోజు థియేటర్ల వద్ద పోటీపడితే ఎవరోకరు నష్టపోవాల్సి రావొచ్చన్న ఆలోచనల నేపథ్యంలో -సైరా వెనక్కి జరిగొచ్చంటూ కథనాలు వినిపించాయి. అయితే, కొణిదెల ప్రొడక్షన్స్ అదేం పట్టించుకోకుండా అక్టోబర్ 2నే సైరాను విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ‘సైరా’ ఇప్పటికే భారీ బిజినెస్ చేస్తుండటంతో, చిరు ప్రతిష్టను దృష్టిలో పెట్టుకుని వెనుకడుగు వేసే ప్రసక్తేలేదని నిర్మాణ రామ్‌చరణ్ ఓ నిర్ణయానికి వచ్చి ఉండొచ్చని అంటున్నారు. సైరా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో -40 కోట్లుపెట్టి డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ తీసుకున్నట్టు వార్తలొస్తున్నాయి. మరోపక్క ఉభయ గోదావరి జిల్లాల్లో సినిమా హక్కులకు సంబంధించి 19.5 కోట్లమేర బిజినెస్ జరిగిపోయిందనీ వినిపిస్తోంది. చిత్రబృందం ఈ కథనాలను ధ్రువీకరించకున్నా -ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోన్న సైరా బిజినెస్ విషయంలో ఎలాంటి సందేహాలు లేవన్న ధీమాతో టీం కనిపిస్తోంది. -ఎట్టిపరిస్థితుల్లోనూ అక్టోబర్ 2నే సినిమాను థియేటర్లకు తేవాలన్న నిర్ణయానికి వచ్చాకే తేదీని అధికారికంగా ప్రకటించారని అంటున్నారు. విడుదల తేదీ దగ్గర పడటంతో సైరా ప్రాజెక్టుతో బిజీగా ఉన్న నిర్మాత రామ్‌చరణ్ -అకస్మాత్తుగా బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ ‘దబాంగ్-3’ని ప్రమోట్ చేస్తున్నాడు. బాలీవుడ్‌లో పట్టున్న హీరో కనుక -సినిమా విడుదల టైంలో ‘సైరా’ను సల్మాన్‌తో ప్రమోట్ చేయించాలన్న వ్యూహంలో ఇది భాగమేనంటున్నారు పరిశీలకులు. సో, సైరా వ్యాపార కోణంలో రామ్‌చరణ్ సరైన వ్యూహానే్న అనుసరిస్తున్నాడన్న వ్యాఖ్యలూ లేకపోలేదు. దర్శకుడు సరేందర్‌రెడ్డి తెరకెక్కించిన సైరాలో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతిబాబు, నయనతార, తమన్నా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శరవేగంగా సాగుతోన్న డబ్బింగ్‌లో భాగంగా -సైరాలోని లక్ష్మి పాత్రకు తమన్నా తన డబ్బింగ్ పూర్తి చేసేసిందట. ‘ఈ సినిమాలో పనిచేయడం నిజంగా అద్భుతం, నా అదృష్టం’ అంటూ సోషల్ మీడియాకు ఓ కామెంట్ పోస్ట్ చేసింది.
ఇద్దరు కాదట..
ఇదిలావుంటే, సైరాలో తన పని ముగించుకున్న చిరంజీవి -తదుపరి చిత్రాన్ని సన్నాహమవుతున్నట్టు ఇండస్ట్రీ టాక్. దర్శకుడు కొరటాల తెరకెక్కించనున్న తదుపరి ప్రాజెక్టులో -చిరంజీవి సామాజిక సందేశంతో కూడిన వినోదభరిత కథలో కనిపిస్తాడని అంటున్నారు. చిరు ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు వచ్చిన కథనాల్లో వాస్తవం లేదనీ తెలుస్తోంది. సాంకేతిక నిపుణల ప్రక్రియ దాదాపుగా పూర్తి కావడంతో, నాయికల కోసం త్వరలోనే ఆడియన్స్ నిర్వహించొచ్చని తెలుస్తోంది. చిరంజీవి డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్న కొరటాల ప్రాజెక్టులో తనకు చాన్స్ ఉండొచ్చన్న ఆశలో కాజల్ మాత్రం ఉందట