చివరి షెడ్యూల్‌లో చేతిలో చెయ్యేసి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొమరపు ప్రొడక్షన్స్ పతాకంపై మేరీ కృపావతి, ప్రభుదాస్ సమర్పణలో కెజె రాజేష్, దేవదాస్ నిర్మిస్తోన్న చిత్రం -చేతిలో చెయ్యేసి చెప్పుబావ. కట్ల రాజేంద్రప్రసాద్ దర్శకత్వం వహిస్తోన్న చిత్రంలో అరుణ్, ఆదిత్య ఓం, రోహిణి, అంజనా హీరో హీరోయిన్లు. లవ్ అండ్ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న చిత్రం చివరి షెడ్యూల్ శంషాబాద్ పరిసరాల్లో జరుగుతోంది. దర్శకుడు రాజేంద్రప్రసాద్ సినిమా వివరాలు అందిస్తూ -డిఫరెంట్ కానె్సప్ట్‌తో తెరకెక్కుతోన్న లవ్ అండ్ హారర్ థ్రిల్లర్ ఇది. లీడ్‌రోల్స్‌తోపాటు విలన్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఉన్న కథ ఇది అన్నారు. నిర్మాత రాజేష్ మాట్లాడుతూ -కొత్తవాళ్లే అయినా ఆర్టిస్టులంతా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మంచి కంటెంట్‌తో వుస్తున్న చిత్రాన్ని ఆడియన్స్ ఆదరిస్తారన్న నమ్మకం ఉంది అన్నారు. హీరో ఆదిత్యఓం మాట్లాడుతూ -చాలాకాలం తర్వాత మంచి చిత్రంతో వస్తున్నా అన్నారు. హీరో అరుణ్ రాహుల్ మాట్లాడుతూ -నందిని సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయస్తుడినే అన్నారు. హీరోయిన్ రోహిణి పూజ మాట్లాడుతూ -లవ్, రొమాన్స్ కలగలసిన సినిమాను ఆదరించాలని కోరారు.