పోస్టర్.. పండగే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆశించినంత హిట్టుకాకున్నా సాయితేజ కెరీర్‌కు -‘చిత్రలహరి’ సంతృప్తినిచ్చిన సినిమానే. అయితే ఈసారి ఖాయంగా హిట్టందుకునే ప్రయత్నంతో చేస్తోన్న చిత్రం -ప్రతిరోజూ పండగే. చిత్రలహరి తరువాత చాలా గ్యాప్ తీసుకుని ఈ కథ ఎంచుకున్నాడు తేజు. బంధాలు అనుబంధాల మేళవింపే కుటుంబమన్న కానె్సప్ట్‌తో దర్శకుడు మారుతి డిజైన్ చేసిన స్టోరీ -ప్రతిరోజూ పండగే. టైటిల్‌లోనే పండగలాంటి అట్రాక్షన్ కనిపిస్తుంటే, తాజాగా సినిమా నుంచి పోస్టర్ రుచి చూపించారు. సినిమా సగానికి పైగా చిత్రీకరణ పూరె్తైనట్టు తెలుస్తోంది. సినిమాలో సాయితేజ్‌తో రాశిఖన్నా రొమాన్స్ చేయనుంది. కథానాయకుడి తాత పాత్రలో సత్యరాజ్ కనిపించనున్నారు. తాజాగా తేజు, సత్యరాజ్ పాత్రలు ఎంత ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటాయో రుచి చూపిస్తూ.. ఫస్ట్‌లుక్ పోస్టర్ వదిలారు. గ్రామీణ నేపథ్యంలో తాతా మనవళ్ల మధ్య అనురాగానికి అద్దంపడుతోన్న పోస్టర్ పండగంత నిండుగా కనిపిస్తోంది. పోస్టర్ లుక్‌తోనే దర్శకుడు మారుతికి మంచి మార్కులు కొట్టేశాడు.