పూరీ మార్క్ లవ్వే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రేమ కథను పూరి తెరకెక్కిస్తే దానికో మార్క్ ఉంటుంది. హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్‌గాని, రిలేషన్‌గాని ఊహకందనంత అందంగా ఉంటుంది. అలాంటి కథనే ఇప్పుడు విజయ్ దేవరకొండతో తెరకెక్కించనున్నాడట. విజయ్ దేవరకొండ ప్రస్తుతం దర్శకుడు క్రాంతిమాధవ్‌తో సినిమా చేస్తున్నాడు. చాలకాలం క్రితమే సినిమా మొదలైనా -అప్‌డేట్స్‌కి దూరంగా సినిమా సైలెంట్‌గా సాగిపోతోంది. ఈ సినిమా తరువాత హీరో విజయ్ -పూరితో ప్రాజెక్టు చేయాల్సి ఉంది. పూరి సొంత బ్యానర్‌పై నిర్మితమయ్యే సినిమా నవంబర్‌లో రెగ్యులర్ షూటింగ్‌కి వెళ్లనుందన్న టాక్ వినిపిస్తోంది. వచ్చే వేసవి సీజన్‌ను టార్గెట్ చేసి పూరి సినిమా తెరకెక్కిస్తాడట. సినిమాను చకచక నడిపించటంలో పూరి దిట్ట కనుక -వచ్చే వేసవికి ఖాయంగా సినిమా వచ్చేస్తుందనే అంటున్నారు. అయితే -కథకు సంబంధించి కొద్దిరోజులుగా అనేక కథనాలు వినిపిస్తున్నా.. ఇస్మార్ట్‌లాంటి మాస్ సినిమా తీసిన పూరి.. ఇప్పుడు తన మార్క్ లవ్‌తోనే స్క్రీన్‌కు రానున్నట్టు తెలుస్తోంది. కథకు సంబంధించి కొద్దిరోజుల పాటు బాక్సింగ్ నేపథ్యంలో వస్తోన్న సినిమా అన్నారు. తరువాత డాన్‌కి.. అతని కొడుక్కి మధ్య నడిచే స్టోరీ అన్నారు. తాజాగా ప్రేమ కథేనన్న మాట వినిపిస్తోంది. పూరి మార్క్ లవ్‌ని విజయ్ దేవరకొండ సరైన స్టామినాతో ప్రజెంట్ చేయగలడన్న నమ్మకాలు లేకపోలేదు. యంగ్ సెనే్సషన్‌గా విజయ్‌తో ప్రేమ కథ చెయడమే బెటరన్న బలమైన ఆలోచనలోనే పూరీ ఉన్నాడని అంటున్నారు.