వ్యాస్‌గా కోటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజకీయ నేత దేవినేని నెహ్రూ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం -దేవినేని. బెజవాడ సింహం అన్నది టాగ్‌లైన్. నర్రా శివనాగేశ్వర రావు తెరకెక్కిస్తోన్న చిత్రంలో తారకరత్న టైటిల్ రోల్ చేస్తున్నాడు. ఆర్‌టిఆర్ ఫిలింస్ పతాకంపై రాము రాథోడ్ సినిమా నిర్మిస్తున్నారు. బెజవాడలో ఇద్దరు నేతల మధ్య స్నేహం, వైరం, కుటుంబ నేపథ్యంలోని సెంటిమెంట్ ముఖ్యాంశాలుగా సినిమా తెరకెక్కుతోంది. వంగవీటి రాధగా బెనర్జీ, రంగా పాత్రలో సురేష్ నటిస్తున్నారు. చలసాని వెంకటరత్నం పాత్రను తుమ్మల ప్రసన్నకుమార్ చేస్తున్నారు. 1983లో అక్కడ ఎస్పీ బాధ్యతలు నిర్వర్తించిన కెఎస్ వ్యాస్ పాత్రను సంగీత దర్శకుడు కోటి పోషిస్తున్నారు. తాజాగా వ్యాస్ పాత్ర ఫస్ట్‌లుక్‌ని చిత్రబృందం విడుదల చేసింది. దర్శకుడు నర్రా మాట్లాడుతూ -ఆర్టిస్టులంతా ఆయా పాత్రల్లో లీనమైనట్టే చేశారు. 75 శాతం షూటింగ్ పూరె్తైంది. చివరి షెడ్యూల్‌తో టాకీపార్ట్ పూర్తవుతుంది అన్నారు. నిర్మాత రామురాథోడ్ మాట్లాడుతూ -1977 దేవినేని స్టూడెంట్ లైఫ్‌లో జై ఆంధ్ర యాజిటేషన్‌నుంచి సినిమా మొదలవుతుంది. పతాక సన్నివేశాలు సినిమాకు హైలెట్ అన్నారు. వ్యాస్ పాత్రధారి కోటి మాట్లాడుతూ -కెరీర్‌లో ఇది సెకండ్ ఫేజ్. సంగీత దర్శకుడిగా 20 ఏళ్లు రాణించాను. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్‌గా మీముందుకు రాబోతున్నా. నా పాత్రను ఆడియన్స్ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు అన్నారు.