స్పైగా చాణక్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపీచంద్, మెహ్రీన్, జరీన్‌ఖాన్ హీరో హీరోయిన్లుగా ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై తమిళ దర్శకుడు తిరు తెరకెక్కిస్తోన్న చిత్రం -చాణక్య. రామబ్రహ్మం సుంకర ఈ సినిమా నిర్మిస్తున్నారు. స్పై, యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సినిమా దసరాకు విడదలకానుంది. టీజర్, ట్రైలర్స్‌కి మంచి రెస్పాన్స్ రావడం తెలిసిందే. సినిమా విశేషాలు వెల్లడించేందుకు హైదరాబాద్‌లో చిత్రబృందం ప్రెస్‌మీట్ నిర్వహించింది. హీరో గోపీచంద్ మాట్లాడుతూ -రెండేళ్ల క్రితమే దర్శకుడు తిరు చెప్పిన కథ నచ్చింది. కొన్ని మార్పులు సూచించా. సస్పెన్స్, స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. అనిల్ సుంకర రిచ్‌గా నిర్మించారు. టీం కష్టం స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఆడియన్స్‌కి బాగా నచ్చే సినిమా అని నమ్ముతున్నా అన్నారు. నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ -దర్శకుడు తిరు చాణక్య కథ చెప్పాడు. స్పై బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. అబ్బూరి రవి మంచి డైలాగ్స్ రాశారు. గోపీచంద్ సపోర్టుతో సినిమా త్వరగా పూర్తయ్యింది. ప్రేక్షకులకు మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని అన్నారు. దర్శకుడు తిరు మాట్లాడుతూ -తెలుగులో ఇది నా మొదటి సినిమా. ఇండియన్ ఏజెంట్‌గా గోపీచంద్ కనిపిస్తాడు. అనిల్ సుంకర బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా అమేజింగ్‌గా నిర్మించారు. గోపీ సహకారంతో సినిమా త్వరగా పూర్తి చేశాం అన్నారు. అబ్బూరి రవి మాట్లాడుతూ -స్పై థ్రిల్లర్ చిత్రమైనా యాక్షన్ ఎపిసోడ్స్ ఎగ్జయింట్‌మెంట్ ఇస్తాయి. గోపీచంద్ ఫస్ట్‌టైం కొత్త జోనర్‌లో చేసిన సినిమా ఇది. అందరికీ నచ్చేలా ఉంటుంది అన్నారు.