నవ్వుతూనే ఉంటారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం -తెనాలి రామకృష్ణ బిఏబిఎల్. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రాన్ని చూసే ఆడియన్స్ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకూ నవ్వుతూనే ఉంటారని హామీ ఇస్తున్నాడు హీరో సందీప్‌కిషన్. హన్సిక మోత్వానీ హీరోయిన్‌గా, వరలక్ష్మీ శరత్‌కుమార్ ముఖ్యపాత్రలో నటించిన చిత్రాన్ని దర్శకుడు జి నాగేశ్వర్ రెడ్డి తెరకెక్కించారు. నీలకంఠేశ్వర స్వామి క్రియేషన్స్ బ్యానర్‌పై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. హైదరాబాద్‌లో చిత్రబృందం ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో హీరో హీరోయిన్లు ఇద్దరూ సంయక్తంగా టీజర్ విడుదల చేశారు. అనంతరం సందీప్ మాట్లాడుతూ -నాగేశ్వర్ రెడ్డి మీదున్న నమ్మకంతో అతని స్నేహితులు నిర్మిస్తోన్న చిత్రాన్ని ఎంజాయ్ చేస్తూ పూర్తి చేశాం. ఫస్ట్ టైం పనిని హండ్రెడ్ పర్సెంట్ ఎంజాయ్ చేస్తూ చేశా. ఈ చిత్రానికి నాగేశ్వర్ రెడ్డి దర్శకుడు కావడం అదృష్టం. ఎమోషన్స్‌తోపాటు పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. హన్సికతో వర్క్ చేయటం అమేజింగ్. ఆడియన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఎంజాయ్ చేస్తారు అన్నాడు. హన్సిక మాట్లాడుతూ -నాగేశ్వర్ రెడ్డితో ఇది రెండో సినిమా. ఫ్యామిలీ అండ్ యూత్‌కి అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్. అలాంటి సినిమాలో భాగమైనందుకు హ్యాపీగా ఉంది అన్నారు. దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ -నా స్నేహితులకు నేనిచ్చే గిఫ్ట్ ఇది. టీజర్ బావుందంటూ ఎక్స్‌పర్ట్స్ చెప్తుండటం కొత్త ఎనర్జీ ఇచ్చినట్టుంది. హన్సిక వెరీ సపోర్టివ్. రాజసింహ ఇచ్చిన పాయింట్‌తో రైటర్స్ మంచి స్క్రిప్ట్ రెడీ చేశారు. నిర్మాతలు ఎంతో హెల్ప్ చేశారు. వాళ్లకు నేనిచ్చే మంచి గిఫ్ట్ ఇదే. టీం మొత్తం కాన్ఫిడెంట్‌తో ఉన్నాం అన్నారు. నిర్మాతలు అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్‌రెడ్డి మాట్లాడుతూ -మిత్రుడు నాగేశ్వర్ రెడ్డి ఏడాది క్రితమే సినిమా చేద్దామన్న ప్రతిపాదన పెట్టాడు. మంచి కథ కుదరడంతో ఇప్పటికి సినిమా చేయడమైంది. మా పనుల్లో మేమున్నా -దర్శకుడే వన్ మాన్ ఆర్మీగా అన్నీ చూసుకోవడం మాకు హ్యాపీ అనిపించింది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అంతా అద్భతంగా చేశారు. ఆడియన్స్‌క మంచి సినిమా ఇస్తున్నామన్న సంతృప్తితో ఉన్నాం అన్నారు.