దునుమాడెర.. సైరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సురేందర్‌ను దర్శకుడిగా తీసుకోవడానికి ప్రధాన కారణం -ఆయన గతంలో చేసిన చిత్రాలే. కథకు పూర్తి న్యాయం చేస్తాడన్న నమ్మకంతోనే భారీ ప్రాజెక్టును అప్పగించా. సురేందర్‌రెడ్డి నిజాయితీ సినిమా అణువణులో కనిపిస్తుంది. పీరియాడికల్ మూవీ డీల్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాడు. -రామ్‌చరణ్

శాడ్ ఎండింగే సైరా సినిమాకు ప్లస్. ఉయ్యాలవాడ కుటుంబీకులు సినిమా నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేశారన్న వార్తలు లేకపోలేదు. అయితే, వందేళ్లు దాటిన జీవిత చరిత్రలు తీయడానికి ఎవరికైనా హక్కు ఉంటుందన్న విషయాన్ని సుప్రీంకోర్టే స్పష్టం చేసింది. ఇలాంటి కేసు ఇటీవల ఓ చిత్రానికి సంబంధించి వచ్చినపుడూ అలాంటి తీర్పే వచ్చింది.
-సురేందర్ రెడ్డి

ఉద్యమకారుడు రెచ్చిపోయాడు. బ్రిటీష్ సేనను దునుమాడాడు. ఉయ్యాలవాడు నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి కొత్త అనుభూతినిచ్చాడు. ముందు ప్రకటించినట్టే -బుధవారం సైరా ట్రైలర్ విడుదలైంది. కొణిదెల ప్రొడక్షన్స్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రాన్ని దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించటం తెలిసిందే. దర్శక, నిర్మాతల సమక్షంలో హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో రమేష్ ప్రసాద్ ట్రైలర్‌ను విడుదల చేశారు. అనంతరం మీడియాకు రామ్‌చరణ్, సురేందర్‌రెడ్డి చిత్ర విశేషాలు వెల్లడించారు.

ఇదోక ఉదాత్తమైన యథార్థ చారిత్రక సంఘటన. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాట ప్రేరణతో గ్రంథాలు, స్టాంపులు, మదరాసు నుంచి గెజిట్స్‌ను పరిశోధన చేసి కథ సిద్ధం చేసుకున్నాం. కథలో పాత్రలు డిమాండ్ చేసినందున పెద్ద తారలను నటింపచేశాం.
చిరంజీవి లుక్స్ సరికొత్తగా ఉండేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం. ఎంతోమంది నుంచి అభిప్రాయాలు సేకరించి -చిరంజీవిని ఎలా ప్రజెంట్ చేస్తే ప్రేక్షకులకు నచ్చుతుందో ఆవిధంగా చేసే ప్రయత్నం చేశాం.
సినిమా అద్భుతంగా వచ్చింది. పడిన కష్టానికి యూనిట్ మొత్తం సంతోషంగా ఉంది. పవన్‌కల్యాణ్ వాయిస్ ఓవర్‌లో కథ నెరేట్ చేయటం జరిగింది.
సైరా నరసింహారెడ్డి సినిమా నావద్దకు వచ్చాక, ముందు నన్ను నేను సిద్ధం చేసుకున్నా. భారీ బడ్జెట్ చిత్రమే అయినా -చిరంజీవి అన్నివిధాలా వెనుకుంటారన్న ధైర్యం నాది.
ఈ కథను పదేళ్ల క్రితమే నాన్న ఓకె చేశారు. ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిన కథ కాదు.
చరణ్ స్టామినాకు తగిన పాత్ర సినిమాలో లేదు. ఆయన ఈ సినిమాలో నటించలేదు.
నిర్మాత జాబ్ చాలా సంతృప్తికరంగా ఉంది. అంతా అన్నివిధాలా సహకరించటంతో మంచి సినిమా చేశానన్న ధైర్యం ఇప్పుడొస్తోంది. ముఖ్యంగా కానె్సప్టె ఓరియెంట్ చిత్రాలు చేయాల్సి వచ్చినపుడు ఎలా చేయాలో.. ఆ విషయాన్ని ముందుగానే ప్రణాళిక వేసుకున్నా. ఆ ప్లాన్ అనుసరించటంతో పని సులువైంది.
ప్రజల కోసం నిజాయితీగా పనిచేసిన వ్యక్తి చరిత్రను నిక్షిప్తం చేయాలన్న సత్ సంకల్పంతో చేసిన చిత్రమిది. ఈ సినిమానే ఎందుకు ఎంచుకున్నానంటే చిరంజీవి 150 చిత్రాలు పూర్తి చేశారు. వాటిలో నేను రూపొందించబోయే సినిమా నెంబర్‌వన్‌గా ఉండాలని, అది మా నాన్నకు నేనిస్తున్న గిఫ్ట్‌గా భావించే సినిమా చేస్తున్నా.
ఆలోచన మంచిదైతే అంతా మంచే జరుగుతుంది. ఎంత ఖర్చుపెట్టి తీశామా? ఎన్నివేలమందితో షూటింగ్ చేశామా? అని ఆలోచిస్తూనే.. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన గొప్ప నటులను చిత్రంలో భాగం చేసి పూర్తి సంతృప్తి పొందుతున్నాం. ఇదంతా తండ్రిపై నాకున్న ప్యాషన్, చరిత్రపై వున్న రెస్పెక్ట్.
ఇంత తారాగణం పెట్టుకోడానికి కథలో కమర్షియల్ కోణం ఏముందని చాలామందే అడిగారు. నరసింహారెడ్డి జీవితమే ఓ కమర్షియల్ ఎలిమెంట్. దేశంకోసం చనిపోయిన మహానుభావుడి తలను 30ఏళ్లపాటు రాజుకోటకు వ్రేలాడదీయటంకన్నా గొప్ప కమర్షియల్ పాయింట్ ఏముంటుంది? అది ఎంత గొప్పగా ఉంటుందో అక్టోబర్ 2న చూడండి.