టైమొచ్చేసింది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యూత్ సెనే్సషన్ విజయ్ దేవరకొండ బాలీవుడ్ స్క్రీన్‌కు వెళ్లే సమయం ఆసన్నమైందా? ఔనన్న సమాధానంతో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది ఇండస్ట్రీలో. గీతగోవిందంతో ఓ బెంచ్ మార్క్ క్రియేట్ చేసుకున్న విజయ్ -ఆ తరువాత చేసిన ‘డియర్ కామ్రేడ్’తో మైలేజ్ నిలుపుకోలేకపోయాడు. అయితే ఆ సినిమా అంచనాలను అందుకోలేకున్నా -రౌడీ ఫ్యాన్స్‌ని మాత్రం బాగానే సంతృప్తిపర్చింది. తలకిందులైన సినిమా ఫలితం -విజయ్ కెరీర్‌పై ఏమాత్రం ప్రభావం చూపించలేదన్నది తదుపరి పరిణామాలు రుజువు చేస్తున్నాయి. యూత్ సెనే్సషన్ ఐకాన్‌గానే విజయ్‌ని చూస్తూ.. అతనితో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. సౌత్ లాంగ్వేజెస్‌లో ఇటీవల విజయ్‌కి పెరిగిన ఇమేజ్ తక్కువ చేయలేం. ఆ ఇమేజ్‌తోనే బాలీవుడ్ స్క్రీన్‌కు తీసుకెళ్లే ఏర్పాట్లు అక్కడి పెద్ద నిర్మాతలు చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్‌లో విజయ్‌తో పెద్ద సినిమా చేస్తే, అతనికున్న సౌత్ క్రేజ్‌తో సినిమాకు ఇక్కడా ఇంపాక్ట్ ఉంటుందన్న ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఆలోచనతోనే కరణ్‌జోహార్ -సిద్ధార్థ్‌రాయ్‌కపూర్ -సాజిద్ నడియావాలా.. ముగ్గురూ భారీ ప్రాజెక్టును విజయ్‌తో ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇటీవలి బాలీవుడ్ ట్రెండ్‌ను అనుసరించి -విజయ్‌తో సోలో సినిమా చేసే అవకాశం ఎంతమాత్రం లేదన్న సమాచారమూ వినిపిస్తోంది. టాప్ హీరోలుతప్ప, కుర్ర హీరోలంతా ‘మల్టీ హీరో’ సినిమాలవైపే ఆసక్తి చూపుతోన్న తరుణంలో -ఒక బాలీవుడ్ హీరోతో విజయ్ స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం ఉండొచ్చన్నది ఓ అంచనా.