ఐపిఎస్‌గా మరో చాన్స్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవలే తెలుగులో చిన్న సినిమాగా విడుదలై మంచి హిట్ అందుకున్న ‘క్షణం’ సినిమా ఇపుడు బాలీవుడ్‌కి వెళ్లనుంది. ఆ సినిమాలో అనసూయ చేసిన ఐపిఎస్ పాత్రని టబుతో రీప్లేస్ చేయబోతున్నారట. సల్మాన్‌ఖాన్ కథానాయకుడిగా నటిస్తాడని ప్రచారం సాగుతోంది. ఒరిజినల్ వెర్షన్‌లో హీరోయిన్‌గా నటించిన ఆదాశర్మని హిందీలో కూడా కంటిన్యూ చేయబోతున్నారట. ఇక అనసూయ పోషించిన పాత్రకి టబు అయితేనే బాగుంటుందని చిత్ర బృందం భావిస్తున్నట్టు సమాచారం. ‘దృశ్యం’ హిందీ రీమేక్‌లో కూడా టబు ఐపిఎస్ అధికారిగా చక్కటి అభినయాన్ని ప్రదర్శించింది. అందువల్లే ‘క్షణం’లో పాత్ర ఆమెని వరించినట్టు తెలుస్తోంది. నిజానికి తెలుగు క్షణంలో అనసూయ పోషించిన పాత్రని కూడా మొదట టబుతోనే చేయించాలనుకున్నారట. కేవలం కోటి రూపాయలతో తెరకెక్కిన ఈ చిత్రం భారీ స్థాయిలో లాభాన్ని తెచ్చిపెట్టింది. హిందీలో కాస్త ఎక్కువగానే బడ్జెట్టు పెట్టి సినిమా తీయాలనుకుంటున్నారు. త్వరలోనే ఆ సినిమాకి సంబంధించి మరిన్ని అప్‌డేట్స్ రాబోతున్నాయి.

చిత్రం టబు