అంతం కాని సస్పెన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రష్మిగౌతమ్, చరణ్‌దీప్ ప్రధాన తారాగణంగా జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అంతం’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. కథానాయిక రష్మి పుట్టిన రోజు సందర్భంగా అంతం చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత కళ్యాణ్ మాట్లాడుతూ, రాంగోపాల్‌వర్మకు వీరాభిమాని అయిన తాను, ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘అంతం’ చిత్రాన్ని టైటిల్‌గా పెట్టుకున్నానని, సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో అందరికీ నటించే అవకాశం వున్న పాత్రలు లభించాయని తెలిపారు. చరణ్ క్రియేషన్స్ పతాకంపై రూపొందిస్తున్న ఈ సినిమా చిత్ర కథ సరికొత్తగా వుంటుందని, రష్మి గౌతమ్ గ్లామర్‌తోపాటు నటన అందరికీ నచ్చేలా సాగుతుందని, సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించామని తెలిపారు. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు యాప్ట్ అయ్యేలా సాగే కథనంతో ప్రతి సన్నివేశం థ్రిల్ కలిగిస్తుందని, చివరిభాగంలో ప్రేక్షకుడు ఆశ్చర్యపోతాడని ఆయన అన్నారు. వేసవి కానుకగా విడుదల చేయనున్న ఈ సినిమాకు సంగీతం: కార్తిక్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, నిర్మాత:వి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్.

చిత్రం రష్మి