ఏడాదిగా ఎదురుచూసిన కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లు శిరీష్ హీరోగా ఎమ్.వి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ నెంబర్ 2 సినిమా గురువారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రారంభమైంది. ఎస్.శైలేంద్ర బాబు, కె.వి.శ్రీ్ధర్‌రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి నిర్మాతలు. ముహూర్తపు సన్నివేశానికి బోయపాటి శ్రీను క్లాప్‌కొట్టగా.. శ్రీనువైట్ల కెమెరా స్విచ్‌ఆన్ చేశారు. మారుతి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా హీరో అల్లు శిరీష మాట్లాడుతూ, ఈ సినిమా డైరెక్టర్ తనకు మంచి స్నేహితుడని, తన సినిమాలకు అసోసియేషన్ డైరెక్టర్‌గా పనిచేశాడని, నేను సింగిల్ సిట్టింగ్‌లో ఓకే చెప్పిన సినిమా ఇదని అన్నారు. ఇలాంటి కథ కోసం ఏడాదిగా ఎదురుచూస్తున్నానని, ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమా షూటింగ్ తరువాత జూలై మొదటివారంలో ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లనుందని, యాక్షన్, కామెడీ, పెర్ఫార్మెన్స్‌తోసహా అన్ని ఎలిమెంట్స్ ఉన్న ఈ కథమీద చాలా నమ్మకంగా ఉన్నామని చెప్పారు.
దర్శకుడు ఎం.వి.ఎన్.రెడ్డి మాట్లాడుతూ, ఈ సినిమాను లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నామని, సినిమాలో పీరియాడిక్ సెటప్ కూడా వుంటుందని, 700 సంవత్సరాల క్రితం జరిగే ఫ్లాష్‌బ్యాక్ చూపించబోతున్నామని, కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా సినిమా వుంటుంది అని చెప్పారు. నిర్మాత శైలేంద్రబాబు మాట్లాడుతూ, తెలుగులో ఇది మా రెండవ చిత్రమని, మంచి కథ, సినిమా బాగా వస్తుందనే నమ్మకంతో నిర్మిస్తున్నామని, ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నానని అన్నారు. హరీష్ దుగ్గిశెట్టి మాట్లాడుతూ, శిరీష్‌కు యాప్ట్ అయ్యే కథ ఇదని, ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ అని చెప్పారు. ఈ చిత్రానికి మ్యూజిక్:జిబ్రన్, ఫోటోగ్రఫి:సంజయ్ లోకనాథ్, ఎడిటింగ్:గౌతంరాజు, ఆర్ట్:బ్రహ్మకడలి, కోడైరెక్టర్:రాధాకృష్ణ పూసల, నిర్మాతలు:ఎస్.శైలేంద్రబాబు, కె.వి.శ్రీ్ధర్ రెడ్డి, హరీశ్ దుగ్గిశెట్టి, దర్శకుడు:ఎమ్.వి.ఎన్.రెడ్డి.