యూత్‌ఫుల్.. రాజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనే్వష్, సారికను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ మాధవి కేసాని దర్శకత్వంలో జిఎస్ జాషువా రాజు నిర్మిస్తోన్న చిత్రం -జిగేల్‌రాజా. శ్రీ రిత్విక ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో శ్రీరంగం సతీష్‌కుమార్ పర్యవేక్షణలో ఫిల్మ్‌నగర్‌లో సినిమా షూటింగ్ మొదలైంది. చిత్రానికి తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ చైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్ క్లాప్‌నివ్వగా, టీమా సెక్రటరీ స్నిగ్ధ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. శ్రీరంగ సతీష్ గౌరవ దర్శకత్వం వహించారు. ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ -జెఎస్ జాషువారాజుకు ఇది రెండో సినిమా. ఈ చిత్రంతో మాధవి కేసాని దర్శకురాలిగా పరిచయం చేస్తున్నారు. ఇండస్ట్రీకి సినిమా మీదున్న ప్యాషన్‌తోవచ్చే చిన్న నిర్మాతలను మేము ఎప్పుడూ ప్రోత్సహిస్తుంటాం. చిన్న సినిమాలు ఎక్కువ వస్తే ఎక్కువమంది టెక్నీషియన్స్‌కి పని దొరుకుతుంది. ఈ చిత్రంలో నటిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు. సినిమా హిట్టవ్వాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు. ఈ చిత్రం చాలా డిఫరెంట్‌గా ఉంటుంది.తప్పకుండా హిట్ అవుతుంది. టీ మా సెక్రటరీ స్నిగ్ధ మాట్లాడుతూ -జిగేల్‌రాజా హిట్టవ్వాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు. శ్రీరంగం సతీష్ మాట్లాడుతూ -ప్రాజెక్ట్‌ని ఎంతో కష్టపడి ముందుకు తెచ్చాం. హీరో హీరోయిన్లు కొత్తవారైనా టాలెంటెడ్ పర్సెన్స్. సబ్జెక్ట్‌కి అనుకూలంగా వాళ్లని తీసుకున్నాం. సినిమాలో సుమన్, పోసానిలాంటి పెద్ద ఆర్టిస్టులనూ తీసుకున్నాం. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుంది అన్నారు. ప్రొడ్యూసర్ జాషువారాజు మాట్లాడుతూ -దర్శకుడు, కొత్త హీరో హీరోయిన్లను పరిచయం చేస్తున్నాం. ప్రాడక్ట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు అన్నారు. మాధవి మాట్లాడుతూ -దర్శకురాలిగా అవకాశమిచ్చినందుకు నిర్మాతలకు కృతజ్ఞతలు. మంచి చిత్రంతో వస్తున్నాం. ఆడియన్స్ ఆదరిస్తారని ఆశిస్తున్నా అన్నారు. సుమన్, పోసాని కృష్ణమురళి, కృష్ణ్భగవాన్, అన్నపూర్ణమ్మ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.