ఆర్డీఎక్స్.. పేలడం ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాయల్ రాజ్‌పుత్, తేజస్ కంచర్ల లీడ్‌రోల్స్‌లో హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై దర్శకుడు శంకర్‌భాను తెరకెక్కించిన చిత్రం -ఆర్డీఎక్స్ లవ్. సి కళ్యాణ్ నిర్మాత. 11న సినిమా విడుదలవుతోన్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. కార్యక్రమానికి అతిథిగా వచ్చిన దర్శకుడు వివి వినాయక్ మాట్లాడుతూ -పోస్టర్స్ చూస్తుంటే సినిమా స్టామినా అర్థమవుతోంది. ఆర్‌ఎక్స్ 100 మాదిరిగా -ఆర్డీఎక్స్ లవ్ పెద్ద హిట్ కావాలని ఆకాంక్షిస్తున్నా. పాయల్ సహా ఎంటైర్ యూనిట్‌కి అభినందనలు అన్నారు. పాయల్ రాజ్‌పుత్ మాట్లాడతూ -ఆర్‌ఎక్స్ 100 సినిమా నాకు లైఫ్‌నిస్తే.. ఆర్డీఎక్స్ లవ్ మరో మెట్టెక్కిస్తుందని అనుకుంటున్నా. దర్శకుడు చెప్పిన కథ నచ్చి ఒప్పుకున్నా. ఎలాంటి సౌకర్యాలు లేని పాపికొండల్లో 45 రోజులు షూట్ చేశాం. ట్యాలెంట్‌వున్న వ్యక్తులతో పని చేసే అవకాశం దక్కింది ఈ సినిమాతో. ఇదొక మైల్ స్టోన్ మూవీ అనుకుంటున్నా అన్నారు. నిర్మాత సి కల్యాణ్ మాట్లాడుతూ -ఇలాంటి మంచి ప్రాజెక్టు రావాలంటే మంచి టీమ్ కావాలి. అలాంటి వ్యక్తులను వెతికిమరీ సినిమాలో భాగం చేశాను. శంకర్‌భాను చెప్పిన కథ బాగా నచ్చింది. ముందు ట్రిపుల్ ఎక్స్ లవ్ అన్న టైటిల్ అనుకున్నాం. ఎక్స్‌పోజింగ్ బేస్ చేసుకుని రిన్నయ్యే సినిమా కాదిది. సినిమా చూస్తే అసలు కథేంటో అందరికీ అర్థమవుతుంది. పాయల్ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. టీంలోని ప్రతి ఒక్కరూ ప్రాణంపెట్టి చేశారు. దర్శకుడు శంకర్‌భానుకు సినిమా మంచి పేరు తేవాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు. దర్శకుడు భాను మాట్లాడుతూ -ఔట్‌పుట్ చూశాక దీన్ని నేనే డైరెక్ట్ చేశానా? అన్నట్టుంది. అలాంటి అద్భుతానికి కారణం సి కల్యాణ్. మంచి టీమ్‌ని ఇవ్వడమే కాదు, మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. గట్స్‌తో తీసిన సినిమా, చూసి ఎంజాయ్ చేయండి అన్నారు. హీరో తేజస్ మాట్లాడుతూ -సినిమాకు రియల్ హీరో పాయల్ రాజ్‌పుత్. దర్శకుడి కష్టం, సినిమాటోగ్రాఫర్ తపన, ఇలా.. ప్రొఫెషనల్స్ పనితనం మీరు స్క్రీన్‌మీద చూస్తారు. పాయల్ వెరీ ప్రొఫెషనల్. ఆమెతో వర్క్ చేయడం చాలా హ్యాపీ అన్నాడు. వికె నరేష్, తులసి పలువురు సినిమా సక్సెస్‌పట్ల నమ్మకం వ్యక్తం చేశారు.