ఈసారి క్రైమ్ కథతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్జున్‌రెడ్డితో ట్రెండ్ సెట్ చేసిన సందీప్ వంగా -్ఫకస్ మొత్తం బాలీవుడ్‌పైనే పెడుతున్నాడన్నది కాదనిలేని వాస్తవం. అర్జున్‌రెడ్డి సెనే్సషనల్ హిట్ తరువాత -బాలీవుడ్ రీమేక్ ‘కబీర్ సింగ్’ను మరో లెవెల్‌కి తీసుకెళ్లి భారీ వసూళ్ల సినిమాగా నిలబెట్టాడు. దీంతో తెగిడిన నోళ్లే సందీప్‌ను పొగడటం మొదలెట్టాయి. ఒక్క కబీర్ సింగ్‌తోనే బాలీవుడ్‌లో క్రేజీ దర్శకుల జాబితాలో చేరిపోయాడు సందీప్. టాలీవుడ్‌లోని స్టార్ హీరోల నుంచి పిలుపులందినా -వాటిపై ఆసక్తి చూపించలేదు సందీప్ వంగా. నేషనల్ స్క్రీన్‌మీదే మరో ప్రాజెక్టు సెట్ చేయడంపైనే ఫోకస్ పెట్టాడు. ఆ ప్రయత్నాలు దాదాపుగా కొలిక్కి వచ్చేశాయ్.
ఈసారి -తనకిష్టమైన క్రైమ్ కానె్సప్ట్‌ను బాలీవుడ్ స్టార్ ఆర్టిస్టులతో తెరకెక్కించేందుకు సిద్ధం కానున్నాడు సందీప్. కబీర్‌సింగ్ నిర్మాతలు భూషణ్‌కుమార్, మురాద్ ఖేతానితోనే మరోసారి టీంకట్టిన సందీప్ -కొత్త ప్రాజెక్టు రూట్‌మ్యాప్ దాదాపుగా క్లియర్ చేసేశాడని అంటున్నారు. టి సిరీస్, సినీ 1 స్టూడియోస్ బ్యానర్లు సంయుక్తంగా కొత్త ప్రాజెక్టును చేపట్టనున్నాయి. తారాగణం ఎవరన్నది తెలియకపోయినా -స్టార్ ఆర్టిస్టులే ప్రాజెక్టులో భాగస్వామ్యం కానున్నారన్న కథనం బాలీవుడ్‌లో వినిపిస్తోంది. ఇంటెన్స్ క్రైమ్ డ్రామాగా సందీప్ ఈ ప్రాజెక్టు చేయనున్నాడని సమాచారం. ముక్తాయింపు ఎంటంటే -ఈ ఒక్క ప్రాజెక్టే కాదు, సందీప్‌తో మరిన్ని చిత్రాలు నిర్మించేందుకు కబీర్‌సింగ్ నిర్మాతలు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇప్పటికే భూషణకుమార్ చూచాయగా వ్యక్తం చేశాడు. సందీప్ వంగాతో చేయాల్సిన చిత్రాలు ఇంకా చాలానే ఉన్నాయి అంటూ హింటిచ్చాడు. సో, పరిస్థితులు చూస్తుంటే.. సందీప్ ఇక బాలీవుడ్‌లోనే సెటిలైపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.