సైరాతో.. సత్తా చాటిన చిరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి విజయం సాధించిన సైరా చిత్రబృందాన్ని టి సుబ్బిరామిరెడ్డి ఆత్మీయంగా సత్కరించారు. పార్క్ హయాత్‌లో జరిగిన కార్యక్రమంలో సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో చిరంజీవి, యూనిట్‌ను సన్మానించారు. సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ -చిరంజీవి చేసిన 150 చిత్రాలు ఒక ఎత్తయితే, సైరా మరో ఎత్తు. చరిత్ర మరుగున పడిన ఉయ్యాలవాడను వెలికితీసి నరసింహారెడ్డి కథతో దేశానికి తన సత్తా చాటాడు. భారీ చిత్ర నిర్మాణానికి తెగువ చూపించిన నిర్మాత రామ్‌చరణ్‌ను అభినందించాలి. దర్శకుడు సరేందర్‌రెడ్డి, నటి తమన్నా, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు... టీం మొత్తం ఎవరి బాధ్యత వాళ్లు నిర్వర్తించి విజయానికి కారకులయ్యారని అభినందించారు. నిర్మాత రామ్‌చరణ్ మాట్లాడుతూ -సుబ్బిరామిరెడ్డి ఫంక్షన్ లేకపోతే ఆ ఏడాది మాకేదో వెలితిగా ఉంటుంది. నాకు గొప్ప అవకాశమిచ్చిన డాడీకి థాంక్స్. ఆయన సినిమాలో నేనూ ఓ వర్కర్‌ని. ఆయన సంకల్పమే మమ్మల్నందరినీ కలిపి పెద్ద సినిమా చేయించింది అన్నారు.
చిరంజీవి మాట్లాడుతూ -పదిహేను రోజులుగా సైరా విజయం గురించే మాట్లాడుతున్నా. కాని ఇక్కడ చెప్పాల్సింది మరొకటుంది. పదిమంది సంతోషంలో తానూ భాగమవుతూ.. పదిమందికీ సంతోషాన్ని పంచే సుబ్బిరామిరెడ్డి గురించి చెప్పాలి. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. జీవితంలో గుర్తుండిపోయే విజయాన్నిచ్చిన సైరా చిత్ర బృందానికి ఎన్నిసార్లు థాంక్స్ చెప్పినా తక్కువే. గౌరవప్రదమైన సినిమాను గిఫ్ట్‌గా ఇచ్చిన రామ్‌చరణ్ నా నిర్మాతల్లో నెంబర్‌వన్ అన్నారు. శాంత బయోటెక్ చైర్మన్ వరప్రసాద్‌రెడ్డి, తమన్నా, సురేందర్‌రెడ్డి, అల్లు అరవింద్, రత్నవేలు, బుర్రా సాయిమాధవ్, మురళీమోహన్, రాజశేఖర్ తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో విక్టరీ వెంకటేష్, జీవిత రాజశేఖర్, వరుణ్‌తేజ్, అల్లు శిరీష్, ఛార్మి, కేథరిన్, అశ్వీనీదత్, బోనీకపూర్, సురేష్‌బాబు, కెఎస్ రామారావు తదితరులు పాల్గొన్నారు.