రాముడు.. మంచోడే కానీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా రూపొందుతున్న కొత్త చిత్రం -ఎంత మంచివాడవురా. శతమానంభవతి ఫేమ్ సతీశ్ వేగెశ్న తెరకెక్కిస్తోన్న సినిమా టీజర్ బుధవారం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది చిత్రబృందం. నిమిషంపైగావున్న టీజర్‌లో పల్లెటూరి నేపథ్యాన్ని చూపించటం ఆహ్లాదకరంగా అనిపించింది. ‘మా మనవడు శివ మంచోళ్లకే మంచోడు.. నా కొడుకు ఆచార్య చాలా మంచోడు.. మా అల్లుడు బాలు చాలా మంచివాడు.. నా తమ్ముడు సూర్య ఎంత మంచోడో..నా అన్నయ్య రుషి చాలా మంచివాడు.. నా హీరో బాలు చాలా మంచోడు.. -అంటూ పాత్రలన్నీ కల్యాణ్‌ని గొప్పగా పరిచయం చేస్తుంటే.. హీరో మాత్రం పదిమందిని చితకబాదుతూ కనిపిస్తాడు. మొత్తానికి టీజర్‌తోనే -ఇదొక ఫుల్‌లెంగ్త్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా అన్న విషయాన్ని చెప్పకనే చెప్పాడు దర్శకుడు సతీశ్. కుటుంబ బంధాలు, ఆప్యాయతానురాగాల మధ్య నడిచే పాత్రలో కల్యాణ్ తొలిసారి కనిపిస్తుంటే, అతనితో మెహ్రీన్ జోడీకడుతోంది. ‘రాముడు కూడా మంచివాడేరా. కానీ, రావణాసురుడిని వేసెయ్యలా?’ అంటూ కల్యాణ్ చెప్పే ముక్తాయింపు డైలాగ్ ఆసక్తిని రేకెత్తించింది. ఉమేష్ గుప్త, సుభాష్ గుప్త సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేయనున్నారు.