నిర్మాతగా నయన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు, తమిళ చిత్రాల్లో కథానాయికగా సుస్థిర స్థానం ఏర్పరచుకున్న నయనతార, అటు సీనియర్, ఇటు జూనియర్ హీరోలతో కలిసి నటించింది. దక్షిణాదిలో నెం.1 కథానాయికగా గుర్తింపు పొందింది. ప్రేమాయణాలు నడపడంలో కూడా నెం.1గా నిలిచింది. ఓవైపు శింబుతో, మరోవైపు ప్రభుదేవాతో ప్రేమాయణాలు సాగించి ఎప్పుడూ సంచలన తారగానే వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం తెలుగులో ‘బాబు బంగారం’ చిత్రంలో నటిస్తోంది. అటు తమిళ్‌లో కూడా అనేక చిత్రాల్లో నటిస్తోంది. ఇన్ని చిత్రాల్లో నటిస్తూ బిజీగా వున్నా సినిమా నిర్మాణంవైపు అడుగులు వేస్తోందని కోలీవుడ్ సమాచారం. దర్శకుడు విఘ్నేష్ శివన్ చెప్పిన కథ నచ్చడంతో తానే ఆ చిత్రాన్ని నిర్మిస్తానని ముందుకు వచ్చిందట. మేలో ఈ సినిమా ప్రారంభం కానుంది. అన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.