విజయ్‌తో సరదాగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొద్దిరోజుల క్రితం వచ్చిన సైరాతో -తమన్నా ఫేట్ మారిపోయింది. సినిమా భారీ విజయం సాధించటం, తమన్నా పాత్రకు విమర్శకుల నుంచీ మంచి అప్లాజ్ రావడంతో -మిల్కీబ్యూటీ గాల్లో తేలిపోతుంది. ఇదే టైంలో తమ్మూ బేబీ తమిళంలో చేసిన ‘పెట్రోమ్యాక్స్’ విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ సాధిస్తోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆనందం వ్యక్తం చేసిన తమన్నా -విజయ్‌తో జోడీ కట్టాలన్న ఆకాంక్షను వ్యక్తం చేసింది. అప్పుడెప్పుడో -విజయ్‌తో ‘సుర’ చేశా. సినిమాలో నా పాత్ర చాలా చిన్నది. సెట్‌కి రావడం, షూట్ తరువాత వెళ్లిపోవడం తప్ప విజయ్‌తో పెద్దగా మాట్లాడేదాన్ని కాదు. అప్పటికే విజయ్ బిగ్ స్టార్. ఇప్పుడనిపిస్తోంది, మరోసారి విజయ్‌తో జోడీ కట్టాలని. ఆ చాన్స్ కోసం చూస్తున్నా’ అంటోంది తమన్నా. ఏమో.. చాన్స్ ఎగురుకుంటూ రావొచ్చు.