చీమ ప్రేమ.. మధ్యలో భామా!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీమేంటి? ప్రేమేంటి? మధ్యలో భామేంటి? కొత్తగా అనిపిస్తోంది కదూ. కొత్తవాళ్లంతా కలిసి కొత్తగా చేస్తోన్న కొత్త ప్రయత్నమే సినిమా అంటున్నాడు చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ‘శ్రీ’ అప్పలరాజు. చీమ ప్రధాన పాత్రలో కనిపించే మాగ్నమ్ ఒపస్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సినిమాలో హీరో హీరోయిన్లు మిస్టర్ ఇండియా, ఫెమినా మిస్ ఇండియా కంటెస్టెంట్‌లు కావడం ప్రత్యేకత. రాజవౌళి ‘ఈగ’ మా సినిమా స్ఫూర్తిదాయకం అంటున్నాడు నిర్మాత లక్ష్మీనారాయణ. అల్పప్రాణి చీమ పాత్రని అపురూపంగా మలచిన తీరుకు అద్దంపట్టేలా ఎస్పీ బాలు టైటిల్ సాంగ్ పాడారు. రవివర్మ సంగీత సారధ్యంలో రూపొందిన పాట బాణీ పది కాలాలు అందరినీ అలరిస్తుందని చెబుతోంది చిత్రబృందం. అమిత్, ఇందు, సుమన్, హరిత, పురంధర్, వెంకట్ నిమ్మగడ్డ, రమ్యచౌదరి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న చిత్రం నుంచి టైటిల్ సింగిల్‌ను త్వరలో విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.