పర్ఫెక్ట్ మేజర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విలక్షణ నటుడిగా అడవి శేష్‌కి మంచి పేరొచ్చేసింది. సినిమా సినిమాకూ స్టామినాను చూపిస్తూ వెళ్తున్న శేష్, భిన్నమైన కథలను ఎంచుకోవడంలోనే తన స్టామినా దాగి ఉందని చెప్పకనే చెబుతున్నాడు. ఊహించని కానె్సప్ట్‌లతో సినిమాలు చేస్తూ.. సక్సెస్ రేటింగ్‌ను పెంచుకుంటున్నాడు శేష్. శేష్ పేరు చెప్పగానే క్షణం, గూఢచారి, ఎవరు? వంటి సూపర్ హిట్స్ గుర్తుకురాకపోవు. ఆడియన్స్‌లో తనకు పెరిగిన ఇంపార్టెన్స్‌ని దృష్టిలో పెట్టుకుని శేష్ మరో టిపికల్ స్టోరీని ఎంచుకున్న విషయం తెలిసిందే. అదే -మేజర్. 26/11 ముంబై దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కథను చేయడానికి ఉపక్రమిస్తున్నాడు. పాత్రపరంగా పర్ఫెక్ట్ లుక్‌కోసం శేష్ కఠోర శ్రమ చేస్తున్నాడని తెలుస్తోంది. 10 కేజీల వరకూ బరువుతగ్గే ప్రయత్నం చేస్తున్నాడట. మేకప్‌లోనే కాదు ఫిజికల్ ఫిట్‌నెస్‌లోనూ మేకోవర్ తెచ్చేందుకు జిమ్‌లో విపరీతమైన వర్కౌట్స్ చేస్తున్నాడన్న మాట వినిపిస్తోంది. సోనీ పిక్చర్స్ బ్యానర్‌పై దర్శకుడు శశికిరణ్ తిక్క తెరకెక్కించనున్న చిత్రంతో -శేష్ మరెలాంటి ఇంప్రెషన్ కలిగిస్తాడో చూడాలి.