ఎందుకిలా.. జరుగుతుంది!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరోగా పడిలేచిన నటుడు గోపీచంద్. హీరోగా విఫలమై.. విలన్‌గా గెలిచి.. తిరిగి హీరోయజాన్ని నిలుపుకున్న కష్టజాతకుడు. గోపీ గ్రాఫ్ ఆడియన్స్‌కి తెలుసు కనుకే -వరుస సినిమాలతో నిరాశపరుస్తున్నా ఇంకా ఆదరిస్తూనే ఉన్నారు. ఒకటైపు యాక్షన్ జోనర్‌కు ఆడియన్స్ ట్యూనై ఉన్నంతకాలం గోపీచంద్ కెరీర్ హాయగానే సాగిపోయంది. అయతే, ఇప్పుడు ట్రెండ్ మారింది. కమర్షియాలిటీ కోణమే మారిపోయంది. అందుకు తగ్గట్టు గోపీచంద్ అప్‌డేట్ కాకపోవడం, సాహసోపేతమైన కథలను ఎంచుకోవడంలో విఫలమవ్వడం.. కెరీర్ గ్రాఫ్ డౌన్ డైరెక్షన్‌కు మారిపోయంది. ఒక్కడున్నాడు, సాహసంలాంటి వైవిధ్యమైన కథలను కమర్షియల్ టచ్‌తో హిట్లందుకున్న గోపీచంద్.. అక్కడే ఉండిపోయాడు. వెటరన్ హీరోలు సైతం కొత్తదనంవైపు అడుగులేస్తుంటే.. గోపీచంద్ మాత్రం ఇంకా ముతక కథలతోనే కాలం వెళ్లదీస్తున్నాడని చెప్పడానికి ఇటీవల వచ్చిన సినిమాలను ఉదహరించొచ్చు. ఆడియన్స్‌కి దగ్గరయ్యే వరకూ మాస్ కథలు చేస్తూ వచ్చిన జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్‌లాంటి వాళ్లే ఎంతో మారారు. అనూహ్యమైన కథలను ఎంచుకుని.. ఎప్పటికప్పుడు ట్రెండ్‌ను అందిపుచ్చుకుంటూ -స్టామినాను ప్రూవ్ చేస్తున్నారు. గోపీచంద్, రవితేజలాంటి హీరోలు మాత్రం మాస్ థాట్స్ దాటి బయటకు రావడం లేదు. సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్‌గా తన 25వ ప్రాజెక్టును సైతం గోపీచంద్ ‘పంతం’పట్టి మరీ మూస కథతోనే సినిమా చేశాడు. ఆ సినిమా ఢమాల్‌మన్నా -అదే ట్రాక్‌లోనే తరువాతి చిత్రాన్నీ పూర్తి చేశాడు. ఇటీవల విడుదలైన భారీ బడ్జెట్ సినిమా చాణక్య -కెరీర్‌కు మైలురాయ కావాల్సింది పోయ మేకై కూర్చుంది. దిగజారుతున్న మార్కెట్‌ను చూసైనా మైండ్‌సెట్ మార్చుకోకుంటే.. కెరీర్ మరింత పెద్ద డేంజర్‌లో పడటం ఖాయం.