కృష్ణవంశీతో మళ్లీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు తెరపై నిన్నటితరం నాయిక -రమ్యకృష్ణ. సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ ఆమె ఫేం తక్కువేం కాదు. వయసుకి తగిన భారీ పాత్రలతో హీరోయిన్లను మించిన ఇమేజ్‌ను సొంతం చేసుకుంది రమ్యకృష్ణ. బాహుబలిలో చేసిన శివగామి పాత్రతో ఆమె మైలేజ్ అందుకోలేని స్థాయికెళ్లింది. అందుకే రమ్యకృష్ణను -దర్శక నిర్మాతలు ప్రత్యేక ఆకర్షణ, అదనపు బలంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కృష్ణవంశీ చిత్రంలో రమ్యకృష్ణ ఓ స్పెషల్ అట్రాక్షన్ కానుందన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ‘నక్షత్రం’ తరువాత గ్యాప్ తీసుకున్న కృష్ణవంశీ -విభిన్నమైన కథతో సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ కథకు రమ్యకృష్ణే కీలకం కానుందన్న వార్త వినిపిస్తోంది. అదే నిజమైతే ‘శ్రీఆంజనేయం’ తరువాత.. పదిహేనేళ్ల తరువాత కృష్ణవంశీ డైరెక్షన్‌లో రమ్యకృష్ణ చేస్తోన్న సినిమా ఇదే అవుతుంది. ‘మేడ్ ఫర్ కాంబో’లో ఎవరెలాంటి రోల్ పోషిస్తారో చూడాలి.