పవన్ గ్రీన్‌సిగ్నల్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనసేనాని మళ్లీ స్క్రీన్‌కు వస్తున్నాడు? ఇది చాలాకాలంగా వినిపిస్తోన్న మాట. ఆయన రాజకీయాల్లోనే ఉంటాడంటూ పీఆర్ టీం పదే పదే చెబుతున్నా -స్క్రీన్ షోపై వార్తలొస్తూనే ఉన్నాయి. తాజాగా అలాంటి కథనమే మరోసారి గట్టిగా వినిపిస్తోంది. ఈసారి దర్శకుడి పేరు సైతం గట్టిగానే వినిపిస్తోంది. కల్యాణ్‌కు క్రిష్ చెప్పిన కథ నచ్చిందట. ఓకే చేసే అవకాశాలూ బలంగానే ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. గమ్యం, వేదం, కృష్ణమ్ వందే జగద్గురమ్, కంచెవంటి డిఫరెంట్ సినిమాలు తెరకెక్కించిన క్రిష్ -బాలయ్యతో ఎన్టీఆర్ బయోపిక్‌నీ తెరకెక్కించాడు. ఇప్పుడు క్రిష్ -పవన్‌కు చెప్పిన కథ ఒకే అయ్యిందన్న టాక్ నిజమైతే.. వీళ్లిద్దరి కాంబోలో సినిమా తెరకెక్కే అవకాశాలను కొట్టిపారేయలేం.