ప్రారంభమైన డాటర్ ఆఫ్ బుచ్చిరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శరత్ కల్యాణ్‌బాబు కథానాయకుడిగా కవి ఫిలిం సిటీ పతాకంపై బండారు దానయ్య కవి స్వీయ దర్శకత్వంలో ప్రారంభమైన చిత్రం ‘డాటర్ ఆఫ్ బుచ్చిరెడ్డి’. ఈ చిత్రానికి సంబంధించిన ముహూర్తపు సన్నివేశానికి శ్రీనివాస్ గౌడ్ క్లాప్‌నివ్వగా, ఆవుల బుచ్చిరెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. కిశోర్ గౌడ్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శక నిర్మాత బండారు దానయ్యకవి మాట్లాడుతూ, ఇదొక పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతోందని, మోరల్ వాల్యూస్‌తోపాటుగా కుటుంబ కథ, కథనాలతో ఈ చిత్రం నిర్మిస్తున్నామని అన్నారు. కథానాయికగా ఓ ప్రముఖ హీరోయిన్ నటించనుందని, అలాగే ప్రముఖ కమెడియన్లందరూ ఈ చిత్రంలో నటిస్తారని, మే మొదటివారం నుండి రెగ్యులర్ షూటింగ్ జరపనున్నామని అన్నారు. కథానాయకుడి పాత్ర హైలెట్‌గా నిలిచే ఈ చిత్రంలో అన్ని హంగులతోపాటుగా సంగీతం, కెమెరా పనితనం హైలెట్‌గా వుంటాయన్నారు.