లక్కీ గాళ్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌత్ ఇండస్ట్రీలో -టాప్‌గేర్‌లో కెరీర్ పరిగెత్తించిన త్రిష కొత్త హీరోయిన్ల రాకతో నెమ్మదించటం తెలిసిందే. పైగా ఓ జోనర్ చిత్రాలు వరుసగా చేయడంతో.. స్టార్ హీరోల కమర్షియల్ సినిమాలకు త్రిష క్రమంగా దూరమైంది. అయితే ఆమధ్య చేసిన 96 హిట్‌తో త్రిషను వెతుక్కుంటూ చాన్స్‌లు మళ్లీ వస్తున్నాయట. సైరా ఇచ్చిన ఉత్సాహంతో చిరంజీవి చేస్తున్న 152 ప్రాజెక్టులో చిరుకు జోడీగా త్రిషను పరిశీలిస్తున్నారన్న కథనాలు వినిపించగానే -మళ్లీ ఆమెకు డిమాండ్ పెరిగినట్టే కనిపిస్తోంది. దర్శకుడు కొరటాల శివ ఈ ప్రాజెక్టును తెరకెక్కించనుండటం తెలిసిందే. చిరు బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయే స్టార్ హీరోయిన్ కోసం చాలామందిని పరిశీలించిన తరువాతే -త్రిషనే మరోసారి రిపీట్ చేయాలన్న ఆలోచనకు వస్తన్నట్టు చెబుతున్నారు. గతంలో చిరుతో త్రిష చేసిన స్టాలిన్ ప్రాజెక్టు మంచి విజయం అందుకుంది. అప్పటికంటే, ఇప్పుడున్న ఫిజికల్ అప్పియరెన్స్‌తో స్క్రీన్‌కు ఇద్దరూ పర్ఫెక్ట్‌గా ఉంటారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, త్రిషను కన్ఫర్మ్ చేసే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే -త్రిష కెరీర్ మళ్లీ ఊపందుకున్నట్టే.