తగ్గేది లేదంటున్నాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా సతీశ్ వేగేశ్నకు పేరుంది. శతమానంభవతి, శ్రీనివాస కళ్యాణంతో తనకంటూ ఓ మార్క్ వేసుకున్నాడు సతీశ్. ఇప్పుడు -ఎంత మంచివాడవురా చిత్రంతో దాన్ని బలోపేతం చేయనున్నాడు. కళ్యాణ్‌రామ్ హీరోగా గ్రామీణ నేపథ్య కథతో తెరకెక్కుతోన్న సినిమా -ఎంత మంచివాడవురా. కుటుంబ కథా చిత్రం కావడంతో సంక్రాంతి సీజన్‌లో సినిమాను థియేటర్లకు తేవాలన్న ఆలోచన మొదటినుంచీ దర్శక, నిర్మాతలు వ్యక్తం చేస్తున్నారు. అయితే సంక్రాంతి రేసులో ఇప్పటికే సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో లాంటి చిత్రాలు ఖరారైపోయాయి. మరోపక్క వెంకీమామ ఊగిసలాటలో ఉంది. జనవరి 10నే రజనీకాంత్ దర్బార్ వస్తోంది. ఇంత పోటీ వున్నప్పటికీ ఎంత మంచివాడవురా కథపై నమ్మకంతో దర్శక, నిర్మాతలు వెనకడుగు వేయడానికి ఇష్టపడటం లేదు. సో, ఆరు నూరైనా సంక్రాంతి రేసులోనే ఈ సినిమా కూడా ఉండొచ్చన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది.