ఫైట్ కోసం 40 కోట్లట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉండదనుకున్న ఇండియన్ 2 మళ్లీ వార్తల్లో బలంగా వినిపిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుగుతుండటంతో.. సినిమాకు సంబంధించి అప్‌డేట్స్ వినిపిస్తున్నాయి. కమల్ -శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఇండియన్ 2పై అంచనాలూ భారీగానే ఉన్నాయి. కమల్‌కి జోడీగా కాజల్ కనిపించనుంది. కొద్దిరోజుల క్రితమే రాజమండ్రి సెంట్రల్ జైలు పరిసరాల్లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించటం తెలిసిందే. ఇండియన్ ఫార్మాట్‌లోనే సెకెండ్ ప్రాజెక్టులోనూ కమల్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇండియన్ ఫస్ట్‌పార్ట్‌లో వృద్ధ ఫ్రీడమ్ ఫైటర్ పాత్రలో యాక్షన్ సీన్స్‌ని అదరగొట్టాడు కమల్. ఇండియన్ 2కి సంబంధించి తాజా అప్‌డేట్ ప్రకారం -90 ఏళ్ళ వృద్ధుడి పాత్రలో కనిపించే కమల్ యాక్షన్ సీక్వెన్స్ కోసం 40 కోట్ల బడ్జెట్ అలాట్‌మెంట్ జరిగిందట. ఈ యాక్షన్ సీక్వెన్స్‌ని పీటర్ హెయిన్స్ పర్యవేక్షణలో వృద్ధ కమల్‌పై తెరకెక్కిస్తారని సమాచారం. ఇండియన్ 2లో రకుల్‌ప్రీత్‌సింగ్, సిద్ధార్థ్, ప్రియా భవానీశంకర్, ఐశ్వర్య రాజేష్, విద్యుత్ జమ్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.