యస్ అంటుందా!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అదృష్టాన్ని నెత్తిన పెట్టుకుని టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన రష్మిక మండన్న -షార్ట్‌కట్ సెనే్సషన్ అనిపించుకుంది. ఛలో, గీతగోవిందం చిత్రాలు ఆమెను ఓవర్‌నైట్ స్టార్‌ని చేసేశాయి. టాలీవుడ్ స్టార్ హీరోలు మహేష్, అల్లు అర్జున్ చిత్రాల్లోనూ అవకాశాలు అందిపుచ్చుకున్న ఈ ఫ్రెష్ బ్యూటీ కోసం -స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు సైతం క్యూలో ఉన్నాడంటే.. రష్మిక ఏ లెవెల్ బిజీగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నాగచైతన్య- రష్మికలతో సినిమా చేయాలన్నది దిల్‌రాజు ప్లాన్. ప్రాజెక్టు దర్శకుడు శశి. ఇప్పటికే రష్మికను కలిసి రెండుసార్లు స్క్రిప్ట్ నెరేట్ చేశాడట. ఆమెనుంచి ఔను, కాదు అన్న సమాధానమేమీ లేదట. స్క్రిప్ట్ ఓకె చేస్తే సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాలని చైతు, దిల్‌రాజు ఎదురు చూస్తున్నారు. అయితే వరుస సినిమాలతో బిజీగావున్న రష్మిక ఏం రెస్పాన్స్ ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. నితిన్‌తో వెంకీ కుడుముల తెరకెక్కిస్తోన్న భీష్మ, మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా షూటింగులతో బిజీగావున్న రష్మిక, బన్నీ -సుకుమార్ ప్రాజెక్టుకూ క్లియరెన్స్ ఇచ్చివుంది. ఇక తమిళంలో కార్తీతో సుల్తాన్, కన్నడ సినిమాలతోనూ బిజీగావున్న రష్మిక.. దిల్ రాజు సినిమాకు డేట్స్ ఇవ్వడం కొంచెం అనుమానమే.