5న రానున్న సుప్రీమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయిధరమ్ తేజ్, రాశీఖన్నా జంటగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ రూపొందిస్తున్న చిత్రం ‘సుప్రీమ్’. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యు/ఎ సర్ట్ఫికెట్ లభించిన ఈ చిత్రాన్ని మే 5న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత శిరీష్ మాట్లాడుతూ- సుప్రీమ్ అందరినీ అలరించే మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ వేసవి సెలవుల్లో కుటుంబ సమేతంగా చూసి ఆనందించదగ్గ చిత్రంగా రూపొందిందని తెలిపారు. ఇటీవల విడుదల చేసిన ఆడియోకు మంచి స్పందన లభిస్తోందని ఆయన అన్నారు. మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటుగా మాస్, కమర్షియల్ చిత్రంగా రూపొందిన సుప్రీమ్‌లో యాక్షన్, కామెడీ, రొమాన్స్, ఫ్యామిలీ సెంటిమెంట్ సమపాళ్ళల్లో వున్నాయని దర్శకుడు అనీల్ రావిపూడి తెలిపారు. సాయిధరమ్ తేజ్ డాన్సులు, నటన హైలెట్‌గా వుంటాయని ఆయన అన్నారు.

చిత్రం సాయిధరమ్ తేజ్, రాశీఖన్నా