దీపావళి పెద్ద తెలుగు సినిమా ఒక్కటీ రాదాయె!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పండగంటే -సంతోషానికో సినిమావుంటే చాలనే ట్రెండ్ తెలుగు వాకిట ఎప్పుడో స్థిరపడిపోయింది. ఒకప్పుడు సంక్రాంతికే సినిమా అన్న సంప్రదాయం ఇప్పుడు లేదు. దసరా, దీపావళి, క్రిస్మస్.. ఇలా పండగేదైనా సెలబ్రేట్ చేయడానికి సినిమావుంటే చాలనుకునే రోజులివి. కొనే్నళ్ల క్రితం వరకూ దీపావళి రోజున సినిమాకు ఇంపార్టెన్స్ ఉండేది కాదు. రాత్రి జరుపుకునే పండుగ, పొద్దుట్నుంచీ పిల్లల హడావుడి.. -సో దీపావళిపై సినిమా ఫోకస్ ఉండేదికాదు. టపాసుల హడావుడి పూరె్తైన తరువాత -చానెల్లో వచ్చే సినిమా చూసి పడుకుందాంలే అనే పరిస్థితే. ఇప్పటి కాలం అలాకాదు. పర్యావరణంపై పెరుగుతున్న బాధ్యత.. టపాసులకు డబ్బు దుబారా అనే ఆలోచనల నేపథ్యంలో -ఎంటర్‌టైన్‌మెంట్‌కే మొగ్గు చూపిస్తున్నారు. అందుకే -దీపావళి రోజునా థియేటర్లు వెలిగిపోతున్నాయి. ఇంత ఉపోద్ఘాతం ఎందుకుంటే -ఆధునిక పరిస్థితిని అందిపుచ్చుకున్న అన్ని ఇండస్ట్రీల్లో దీపావళికి పెద్ద సినిమాలు వస్తుంటే.. టాలీవుడ్‌లో మాత్రం ఒకటి రెండు చిన్న సినిమాలు తప్ప స్టార్ హీరోల సినిమాలు లేకుండా పోయాయ. తెలుగు సినిమాకి మార్గదర్శి అయిన తమిళ ఇండస్ట్రీలోనూ సంక్రాంతితో సమానంగా దీపావళికీ పెద్ద చిత్రాలు ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. దీపావళినీ ఫెస్టివ్ సీజన్‌గానే చూస్తున్నారు తమిళ సినీజనాలు.
కొనే్నళ్లుగా తమిళ స్టార్ హీరో విజయ్ ప్రతి దీపావళికీ తన సినిమాను రేసులో నిలబెడుతున్నాడు. స్టార్ హీరోలతోపాటు మీడియం రేంజ్ హీరోలూ దీపావళి ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు ట్రైచేస్తూనే ఉన్నారు. గత ఏడాది ‘సర్కార్’తో సీన్‌లోకి దిగాడు హీరో విజయ్. సినిమాకు మంచి టాక్ లేకున్నా, దీపావళి సీజన్‌లో పోటీలో పెద్ద సినిమాలు లేకపోవడంతో వసూళ్లపరంగా ఓకే అనిపించుకున్నాడు. ఈ ఏడాది విజయ్ నుంచి వస్తున్న ‘బిగిల్’పై భారీ అంచనాలే ఉన్నాయి. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమా కావడం, మాస్ ఎలిమెంట్‌తోవున్న మరో షేడ్‌లో విజయ్ కనిపిస్తుండటంతో సినిమాకు పాజిటివ్ వైబ్ ఉంది. దీనికితోడు హీరో కార్తి ‘ఖైదీ’ రేసులో ఉంది. రా సినిమాగా వస్తోన్న ఖైదీలో హీరో క్యారెక్టరైజేషన్, డాటర్ సెంటిమెంట్ హైలెట్స్‌గా కనిపిస్తున్నాయి. ఓ రాత్రి నాలుగ్గుంటల వ్యవధిలో ఏం జరిగిందన్న ఆసక్తికరమైన మాస్ ఎలిమెంట్ యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తోన్న చిత్రంసైతం -ఆడియన్స్‌ను బాగానే ఎంటర్‌టైన్ చేస్తుందన్న అంచనాలు లేకపోలేదు. అటు బాలీవుడ్‌లోనూ హౌస్‌ఫుల్ 4, మేడిన్ చైనాలాంటి భారీ ప్రాజెక్టులూ దీపావళిని టార్గెట్ చేసుకుని వస్తున్నాయి. పొరుగు ఇండస్ట్రీలన్నీ దీపావళికి వినోదం వెలుగులు పంచే ప్రయత్నం చేస్తుంటే -ఒక్క టాలీవుడ్‌లోనే దీపావళి సినిమా అంటూ లేకుండా పోయింది. ఖైదీ, హౌస్‌ఫుల్, బిగిల్ చిత్రాలు తెలుగు వర్షన్‌లోనూ వస్తుండటంతో -టాలీ ఆడియన్స్ వీటిపైనే ఫోకస్ పెడుతున్నారు. తెలుగులోనూ సీనియర్, మీడియం రేంజ్ హీరోల సినిమాలు దీపావళిని టార్గెట్ చేస్తూ తెచ్చే అవకాశం, సమయం ఉన్నా.. ఎందుకో ఫోకస్ పెట్టినట్టు కనిపించటం లేదు.