చిరు చూపూ అటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైరా హోరు ముగిసింది. 20 రోజుల్లో చేయాల్సిన వసూళ్లు చేసేసింది. రొటీన్‌గా మాట్లాడుకునే లాభనష్టాల లెక్కలు పక్కనపెడితే -చారిత్రక పాత్ర చేయాలన్న చిరు కల సైరాతో నెరవేరింది. దీంతో మెగా అభిమానులు చిరంజీవి తదుపరి ప్రాజెక్టు అప్‌డేట్స్‌పై మక్కువ చూపుతున్నారు. నటుడిగా తన హోదాకు తగిన సోషల్ మెసేజ్‌తో 152వ ప్రాజెక్టును తెచ్చేందుకు చిరు రెడీ అయిపోయాడు. తమిళ ఏస్ డైరెక్టర్ శంకర్ మాదిరిగానే ప్రతి సినిమాలో ఏదోక సోషల్ మెసేజ్‌ను సెంట్రిక్ పాయింట్ చేస్తున్న దర్శకుడు కొరటాల శివ -ప్రాజెక్టును ముందుకు నడిపేందుకు తన ఏర్పాట్లు తను చేసుకుంటున్నాడు. నవంబర్ సెకెండ్ వీక్‌నుంచి సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్తారన్న టాక్ వినిపిస్తోన్న నేపథ్యంలో -టెక్నికల్ టీంలో కీలకమైన ‘మ్యూజిక్’ ఎవరికి అప్పగించాలన్న విషయమై చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. కొరటాల సినిమాకు కలిసొచ్చే సంగీత దర్శకుడు దేవిశ్రీ ఉన్నప్పటికీ -ఈసారి సెంటిమెంట్‌ను మార్చి ట్రెండ్ సృష్టించే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ భారీ సినిమాలకు హిట్ మ్యూజీషియన్లుగా పేరుబడిన ‘అజయ్- అతుల్’ని సీన్‌లోకి తీసుకురావొచ్చని తెలుస్తోంది. ధడక్, థగ్స్ ఆఫ్ హిందుస్థానీలాంటి చిత్రాలకు మంచి సంగీతం సమకూర్చిన అజయ్ -అతుల్ పేర్లు నిర్మాత చరణ్ మైండ్‌నుంచి రావడంతో.. కొరటాల సైతం అటువైపే మొగ్గుచూపుతున్నాడని టాక్. చిరు సైతం ఆసక్తి చూపించటంతో -సంగీతద్వయంతో దర్శకుడు కొరటాల చర్చిస్తున్నట్టు సమాచారం. చిరు సరసన కథానాయికగా త్రిష పేరు బలంగా వినిపిస్తోంది.