హీరో కోసం.. హీరో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్ని సినిమాలూ గీత గోవిందం కావు -అన్న విషయం డియర్ కామ్రేడ్‌తో బాగా అర్థమైంది రౌడీ సెనే్సషన్ విజయ్ దేవరకొండకి. కెరీర్‌లో ఎత్తుపల్లాలు సహజమన్న విషయం డియర్ కామ్రేడ్ సినిమాతో హితబోధ కావడంతో -్ఫ్యచర్ ప్రాజెక్టులపై మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. దర్శకుడు ఆనంద్ అన్నామలైతో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో కొద్దికాలం క్రితం విజయ్ దేవరకొండ ఓ ప్రాజెక్టు మొదలెట్టాడు అదే -హీరో. కొంత షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రాజెక్టు అనూహ్యంగా ఆగిపోయంది. ప్రాజెక్టుపై పదిహేను కోట్ల పెట్టబడి పెట్టినా రషెస్ ఏమాత్రం సంతృప్తకరంగా లేకపోవడంతో.. రాబోయే నష్టాలను అక్కడితో సరిపెట్టేయడం బెటరన్న ఆలోచనకు వచ్చింది మైత్రి. అదే బ్యానర్‌పై వచ్చిన డియర్ కామ్రేడ్ సైతం ఫలితాన్నివ్వక పోవడంతో -హీరో ప్రాజెక్టును పూర్తగా అటకెక్కించేశారు. చాలాకాలంగా హీరో ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్స్ లేవు. తాజాగా ఈ ప్రాజెక్టుపై మళ్లీ కొత్త కబుర్లు వినిపిస్తున్నాయ. హీరో ప్రాజెక్టు తన కెరీర్‌కు మంచి వూపునివ్వగలదని నమ్ముతున్న విజయ్ దేవరకొండ -మైత్రి టీంని ఒప్పించాడన్న టాక్ వినిపిస్తోంది. ఆగిపోయన స్క్రిప్ట్‌మీద దర్శకుడు సైతం రీవర్క్ చేసి కంటెంట్‌ను మరింత షార్ప్ చేయటంతో -హీరో ప్రాజెక్టు తదుపరి షెడ్యూల్‌కు సన్నాహాలు మొదలయ్యాయన్న టాక్ వినిపిస్తోంది. ఢిల్లీలోని బుద్ నేషనల్ సర్క్యూట్‌లో తదుపరి షెడ్యూల్ ఉండొచ్చన్నది ఇన్‌సైడర్ న్యూస్. ఫస్ట్‌టైం స్పోర్ట్స్ జోనర్ కథ చేస్తున్న విజయ్ -ఈ సినిమాలో రేసర్‌గా కనిపిస్తాడట. ఈ పాత్రతో కొత్త అవతారం చూపించేందుకు విజయ్ గట్టిగానే వర్కౌట్స్ చేస్తున్నాడంటున్నారు. పైగా యూనివర్శల్ లైన్‌తో వస్తున్న చిత్రాన్ని సౌత్‌లోని అన్ని భాషల్లోనూ విడుదల చేయాలన్న ఆలోచన చేస్తున్నారట. సో, దేవరకొండ మార్కెట్ విస్తృతికి సినిమా హిట్టు చాలా ముఖ్యం.
-రేసర్ పాత్ర కోసం ఇప్పటికే దేవరకొండ ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో భారీగా విడుదల చేద్దామన్న ఆలోచనతోనే రంగంలోకి దిగుతోందన్న సమాచారం లేకపోలేదు. విజయ్ ఇప్పటికే అటు క్రాంతిమాధవ్‌తోను, ఇటు పూరి జగన్నాథ్‌తో ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నాడు. హీరో ప్రాజెక్టుని ఎలా సీన్‌లోకి తీసుకొస్తాడన్నది ఆసక్తికరం. ఒకవేళ ప్రాజెక్టు మళ్లీ పట్టాలెక్కితే.. లవర్‌బోయ్, అగ్రెసివ్ ఆటిట్యూడ్ పాత్రలతో మెప్పించిన విజయ్ దేవరకొండ రేసర్‌గా ఎలా మెప్పిస్తాడన్నదీ ఆసక్తికరమే.