మహా.. ఓపిక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీర్తిసురేష్ చేస్తున్న తాజా లేడీ ఒరియంటెడ్ సినిమా -మిస్ ఇండియా. మధ్య తరగతికి చెందిన మామూలు అమ్మాయి -మిస్ ఇండియా స్థాయికి ఎలా ఎదిగిందన్న సింపుల్ లైన్‌తో వస్తోన్న సినిమా. ‘మహానటి’తో జాతీయ ఉత్తమ నటిగా ఎదిగిన కీర్తి -కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవడమే కాదు.. ఎంపిక చేసుకున్న కథలోని పాత్రను ప్రతిబింబించే విషయంలోనూ ఓపిగ్గా వ్యవహరిస్తోందట. తమిళంలో స్టార్ హీరోలతో జోడీ కడుతూనే, తెలుగులో నాయిక ప్రాధాన్యతా కథలను ఎంపిక చేసుకుంటోంది. పాత్ర విషయంలో కీర్తి కమిట్‌మెంట్‌ను మిస్ ఇండియా దర్శకుడు నరేంద్రనాథ్ చెబుతూ -ఆమె గొప్ప నటి. ఈ సినిమాలో ఆమె డిఫరెంట్ లుక్స్‌లో కనిపించాలి. ఒక్కో దశలో ఒక్కో లుక్ అవసరం. అందుకోసం -కీర్తి లుక్ విషయంలో మేం చాలా కసరత్తే చేశాం. ప్రతి లుక్‌కీ పది టెస్ట్‌ల వరకూ కట్ చేసినా -చివరి వరకూ కీర్తి అంతే పేషెన్స్‌తో సహకరించటం నాకు ఆశ్చర్యమేసింది. ఆమె ఓపికకు హ్యాట్సాఫ్. కచ్చితంగా ఇది ఆమె కెరీర్‌లో చెప్పుకోతగ్గ మరో చిత్రమే అవుతుంది అంటూ కితాబిచ్చాడు. అందం, అణకువ కలగలిపిన హీరోయిన్ మెటీరియల్ -కీర్తి.