అమ్మో.. కంగన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంగనా రనౌత్ అంటే ఫైర్ బ్రాండ్‌గానే గుర్తొస్తుంది. ఇప్పటికే అనేకసార్లు ఉత్తమ నటిగా అవార్డులు కూడా కొట్టేసి అటు నటనతోపాటు ఇటు గ్లామర్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. కంగన ఎక్కడుంటే అక్కడ సంచలనాలే రేగుతున్నాయి. వాటితోపాటుగా గతంలో ఆమె బాయ్‌ఫ్రెండ్ అధ్యయన్ సుమన్ మరో సంచలనాలను ప్రకటించాడు.
విషయంలోకెళితే, గతంలో వీరిద్దరిమధ్య ప్రేమాయణం సాగేదట. కొంతకాలం తరువాత బ్రేక్‌అప్ అయింది. ఈమధ్య కంగన, హృతిక్ రోషన్‌లమధ్య జరుగుతున్న గొడవల నేపథ్యంలో కూడా సుమన్ విచిత్రమైన వ్యాఖ్యానాలు చేశాడు. అవేంటంటే, కంగనాకు హృతిక్ అంటే చాలా ఇష్టమట. పైగా హై టెంపర్ ఓల్టేజ్ వున్న అమ్మాయిగా అభివర్ణించాడు. ఆమెకు బ్లాక్‌మాజిక్ అంటే చాలా నమ్మకం వుందట. అందుకోసం తన ఇంట్లో ఓ చీకటి గదిని కూడా ఏర్పాటుచేసుకుందని చెప్పాడు. ఈ సంచలన వార్తలన్నీ విన్న తరువాత బాలీవుడ్‌లో మరింత అలజడి చెలరేగుతోంది. చివరికి కంగన రనౌత్ ఇంకా ఎన్ని సంచలనాలు రేపుతుందో చూడాల్సిందే!