ఎంతైనా.. కొడుకు కదా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిత్యవర్మ -రిలీజ్ డేట్ ప్రకటించటంతో హీరో ధృవ్‌కుమార్ కంటే తండ్రి చియాన్ విక్రమ్‌కే టెన్షన్ ఎక్కువైందట. విక్రమ్ టెన్షన్‌కు వంద కారణాలు మరి. కొడుకు ధృవ్‌కుమార్‌ను హీరోగా పరిచయం చేస్తున్న సినిమా ఇది. పైగా సినిమా మొత్తాన్ని రీ షూట్ చేశారు. వివరాల్లోకెళ్తే.. రెండేళ్ల క్రితం దర్శకుడు సందీప్‌వంగా తెరకెక్కించిన అర్జున్‌రెడ్డి ఓ సెనే్సషనల్ హిట్. న్యూ ఏజ్ సినిమాకు అర్జున్‌రెడ్డి షార్ప్ టర్న్ ఇచ్చింది కూడా. భారీ వసూళ్లు రాబట్టి చిత్రానికి వివిధ భాషల్లో రీమేక్‌లు రూపొందాయి. బాలీవుడ్ రీమేక్‌కూ సందీప్ వంగా దర్శకత్వం వహించి ‘కబీర్‌సింగ్’ను మరో రేంజ్‌కి తీసుకెళ్లాడు. అర్జున్‌రెడ్డితో తెలుగు హీరో విజయ్ దేవరకొండ ఓవర్‌నైట్ స్టార్ అయితే.. బాలీవుడ్‌లో కబీర్‌సింగ్‌తో షాహిద్‌కఫూర్ టాప్‌రేంజ్‌కి చేరాడు. అదే ఊపులో తమిళ రీమేక్ కూడా థియేటర్లకు వచ్చేసివుంటే కథ మరోలా ఉండేది. కాని -తమిళ రీమేక్ సవ్యంగా సాగలేదు. రీమేక్‌కు పూనుకున్న ఈ ఫోర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత ముఖేష్ మెహతా ముందు సినిమాను దర్శకుడు బాలాకు అప్పగించారు. ‘వర్మ’ టైటిల్‌తో సినిమా మొదలెట్టిన బాలా, ‘వార్మ’గా టైటిల్ మార్చి సినిమాను పూర్తి చేశాడు. ఆడియో ఫంక్షన్ సైతం అట్టహాసంగానే నిర్వహించారు. అయితే, అవుట్‌పుట్‌పై నిర్మాతకు నమ్మకం కుదరలేదు. సినిమా సంతృప్తికరంగా లేదంటూ సినిమాను పక్కన పడేశాడు ముఖేష్ మెహతా. కొడుకు హీరోగా అరంగేట్రం చేస్తున్న సినిమాకే ఇలాంటి పరిస్థితి రావడంతో -చియాన్ సీన్‌లోకి దిగక తప్పలేదు. ఈ ఫోర్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ను ఒప్పించి రీ షూట్‌కు రెడీ అయ్యారు. గిరీశాయ దర్శకుడిగా మళ్లీ సినిమా మొదలైంది. అంతకుముందు లీడ్‌రోల్ చేసిన కోల్‌కతా బేస్డ్ మోడల్ మేఘను పక్కనపెట్టి.. బనితా సంధుని తమిళానికి పరిచయం చేస్తూ లీడ్‌రోల్‌కి తీసుకున్నారు. ప్రియా ఆనంద్ మరో హీరోయిన్. సినిమా పూరె్తైంది. అంతా సవ్యంగా జరిగింది కనుక -దీపావళికి కొడుకు ధృవ్‌కుమార్‌ను స్క్రీన్‌పై హీరోగా చూడొచ్చనుకున్న సమయానికి -రేసులో పెద్ద సినిమాలు వచ్చేశాయి. భారీ అంచనాలతో వస్తోన్న విజయ్ ‘బిగిల్’, వైవిధ్యమైన కథగా వస్తోన్న కార్తి ‘ఖైదీ’ సినిమాలు దీపావళి రేసులోకి రావడంతో -ఆదిత్యవర్మ చిత్రం మళ్లీ వెనక్కి జరిగింది. ఇప్పుడు నవంబర్ 8న సినిమాను థియేటర్లకు తెస్తున్నట్టు ఈ ఫోర్ బ్యానర్ అధికారికంగా ప్రకటించింది. తెలుగు, హిందీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన కథ -తమిళ ఆడియన్స్ ఎంతవరకూ రిసీవ్ చేసుకుంటారన్నదే విక్రమ్ అసలు టెన్షన్. అర్జున్ రెడ్డి రీమేక్‌గా వస్తున్న ‘ఆదిత్యవర్మ’.. ఎంత సెనే్సషన్ సృష్టిస్తాడన్నది వెండితెరపై చూడాలి.
కొసమెరుపు ఏంటంటే -ఆదిత్యవర్మ ఆడియో లాంచ్ చెన్నైలో నిర్వహించారు. కార్యక్రమంలో నిర్మాత ముఖేష్ మెహతా ఓ సెనే్సషన్ ప్రకటన చేశాడు. తండ్రీ కొడుకులిద్దరూ హీరోలుగా వచ్చే ఏడాది ఓ భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నట్టు ప్రకటించి ఆశ్చర్యపర్చాడు. సో, వచ్చే ఏడాది చియన్, ధృవ్ హీరోలుగా భారీ సినిమా ఉండబోతోందన్న మాట. అది జరగాలంటే -ఆదత్యవర్మ చిత్రంతో ధృవ్ స్టార్‌గా ఎస్టాబ్లిష్ కావాలి. ఇన్ని విషయాల మధ్య సినిమా వస్తోందంటే -హీరో లైఫ్‌ని ఎంతో లోతుగా చూసిన చియాన్‌కు ఆమాత్రం టెన్షన్ ఉండటంలో తప్పేం లేదు.