పింక్ చేస్తాడా!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవన్ మళ్లీ సినిమాల్లోకి వస్తాడో లేదో తెలీదుకానీ, జనం మాత్రం కచ్చితంగా వస్తాడనే ఫిక్సైపోయారు. ఏ ప్రాజెక్టుతో వస్తాడన్న అప్‌డేట్స్ కోసం ఆసక్తిగా చూస్తున్నారు. జనం మాత్రమేకాదు, టాలీవుడ్ టాప్ నిర్మాతలు సైతం పవన్‌ను మళ్లీ స్క్రీన్‌పైకి తెచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్‌ని ఫస్ట్ ఎవరు ఒప్పించుకుంటే -ఆ ప్రాజెక్టుకి ఎన్నో అడ్వాంటేజెస్ ఉంటాయన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మనసులో మాటను పైకి ప్రకటించకున్నా పవన్ సైతం సినిమాలపట్ల ఆసక్తితోనే ఉన్నాడన్న టాక్ లేకపోలేదు. అందులోభాగంగా ఆయన కథలు కూడా వింటున్నాడన్న ప్రచారమైతే లేకపోలేదు. తాజాగా ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోన్న కొత్త టాక్ ఏంటంటే -పవన్‌ని దిల్‌రాజు ఆల్రెడీ ఎంగేజ్ చేసుకున్నాడన్నది. వచ్చే ఏడాది దిల్‌రాజు ప్రొడక్షన్ హౌస్‌నుంచి పవన్‌తో ఓ సినిమా ఉంటుదని అంటున్నారు. పవన్ కోసం కొత్త కథను పుట్టించటం కంటే -ఆల్రెడీ హిట్ స్టోరీని పవన్‌కు అప్లై చేస్తే బావుంటుందన్న ఆలోచన కూడా జరుగుతోందట. 2016లో బాలీవుడ్‌లో వచ్చిన ‘పింక్’ సినిమా భారీ విజయం సాధించింది. అమితాబ్ -తాప్సీ ప్రధాన పాత్రలను పోషించిన సినిమా విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. అదే చిత్రాన్ని తమిళంలో అజిత్-శ్రద్ధా శ్రీనాథ్ కాంబినేషన్‌లో రీమేక్ చేస్తే అదీ హిట్టుకొట్టింది. తెలుగు హక్కులు సొంతం చేసుకున్న దిల్‌రాజ్ -పవన్‌తో రీమేక్ చేయాలన్న ఆలోచనలో ఉన్నాడట. బాలీవుడ్‌లో అమితాబ్, తమిళంలో అజిత్ చేసిన పాత్రలు కనుక.. టాలీవుడ్‌లో పవన్ రేంజ్‌కి తగిన సినిమా అవుతుందన్నది ఆలోచన. ‘ఎప్పుడు వీలైతే అప్పుడు.. పాతిక రోజుల డేట్స్ ఇస్తే చాలు. సినిమా పూర్తి చేయొచ్చు’ అన్న సంకేతాన్ని మిత్రుడు త్రివిక్రమ్ ద్వారా దిల్‌రాజు సంకేతాలు పంపుతున్నట్టు చర్చ నడుస్తోంది. తక్కువ రోజుల షెడ్యూల్, ప్రతిష్టకు భంగం కలిగించని ప్రాజెక్టు కావడంతో పవన్ ఓకే అనే అవకాశాలు ఎక్కువే ఉన్నాయన్నది ఓ అంచనా. పవన్‌ను ప్రాజెక్టుకు ఒప్పించగలిగితే -దిల్‌రాజు సక్సెస్‌ల ఖాతాలో మరో ప్లస్ చేరొచ్చన్న మాట.