ఇమేజే.. శాపమైందా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్జున్‌రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ సెనే్సషనైంది షాలినీ పాండే. పాత్రపరంగా ఆమె చూపించిన గట్స్ -తెలుగు ఇండస్ట్రీలో ఆమెనో రేంజ్‌కు తీసుకెళ్తాయనే అనుకున్నారంతా. చిత్రమేమంటే -అర్జున్‌రెడ్డి ఇమేజే ఆమె పాలిట శాపమైంది. విజయ్ దేవరకొండలాంటి యంగ్ సెనే్సషన్‌తో అద్భుతమైన కెమిస్ట్రీ పండించిన షాలిని -ఆ తరువాత ఆ రేంజ్ సినిమాను అందుకోలేకపోయింది. ఇతర హీరోయిన్లు ఆమెను చూసి అసూయపడేంత గొప్ప సినిమాలైతే ఆమెకు పడలేదు. ఆమధ్య కళ్యాణ్‌రామ్‌తో 118 సినిమా చేసినా -ఉనికి కోసమై అయ్యింది తప్ప కెరీర్‌ను ముందుకు కదల్చలేకపోయింది. అర్జున్‌రెడ్డి హీరోయిన్ అంటూ షాలినిపాండేను అక్కడే ఉంచేయడంతో -ఆ తరువాత చేస్తున్న ప్రాజెక్టులేవీ ఆమెకు కలిసి రావడం లేదు. రాజ్‌తరుణ్‌కు జోడీగా షాలిని పాండే చేస్తున్న తాజా ప్రాజెక్టు -ఇద్దరి లోకం ఒకటే. దిల్‌రాజు నిర్మాణంలో రూపుదిద్దుకున్న చిత్రం నవంబర్‌లో విడుదల కావొచ్చని అంటున్నారు. దర్శకుడు జీఆర్ కృష్ణ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ తన కెరీర్‌కు కచ్చితంగా ప్లస్ అవుతుందన్న నమ్మకంతో ఉంది షాలిని. ఆమె ఆశలు నెరవేరుతాయేమో చూడాలి.